మంత్రి ఈటల రాజేందర్ పై మొదలైన వార్తలు చూస్తుంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తోంది. మంత్రివర్గం నుండి లేదా ఏకంగా పార్టీనుండే ఈటెలను సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్లే అర్ధమైపోతోంది. తనంతట తానుగా రాజేందర్ రాజీనామాను అడిగినా లేకపోతే పార్టీనుండి బయటకు పంపేసినా రాజకీయంగా కేసీయార్ కు చాలా ఇబ్బందులు మొదలైపోతాయి. ఎందుకంటే ఈటల బలమైన బీసీ నేతల్లో ఒకరు కాబట్టి.
ఇలాంటి రాజేందర్ తో కొంతకాలంగా కేసీయార్ కు గ్యాప్ వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వంపైన రాజేందర్ సందర్భం వచ్చినపుడల్లా విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దాంతోనే అర్ధమైపోయింది రాజేందర్ ఎంతోకాలం మంత్రివర్గం, పార్టీలో ఉండలేరని. ఇదే విషయమై పరిస్ధితులు చేయిదాటిపోకుండా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి సహచర మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని సమాచారం. అయితే ఎందుకనో ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి.
ఇలాంటి నేపధ్యంలో హఠాత్తుగా మెదక్ జిల్లాలోని మూసాయిపేట, హకీంపేట గ్రామాలకు చెందిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన అసైన్డ్ భూములను ఈటల బలవంతంగా లాక్కున్నారనే బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. అదికూడా ఏదో ఒక్క చానల్లో కాదు ఏకంగా నాలుగు చానళ్ళల్లో ఒకేసారి. దాంతో జనాలందరికీ విషయం ఒక్కసారిగా అర్ధమైపోయింది. ఇటు వార్తలు రావటం అటు కేసీయార్ స్పందించి విషయంపై విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీకి, ప్రాధమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీపీకి ఆదేశించారు.
ఇవన్నీ చూస్తుంటే గతంలో ఆలె నరేందర్, విజయశాంతి, రాజ్యసభ ఎంపి డీఎస్ ఉదంతాలే గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో వాళ్ల విషయంలో ఏమి జరిగిందో ఇపుడు రాజేందర్ విషయంలో కూడా సేమ్ టు సేమ్ అలాగే జరుగుతోంది. భూకబ్జాలు, దందాల విషయంలో స్వయంగా కేటీయార్, మంత్రి మల్లారెడ్డి, ఎంతోమంది ఎంఎల్ఏలపైన కూడా ఆరోపణలున్నాయి. వాళ్ళ విషయంలో స్పందించని కేసీయార్ ఇపుడు జెట్ వేగంగా స్పందించటం విచిత్రంగా ఉంది. మాజీమంత్రి రాజయ్యను కూడా మంత్రివర్గంలో ఇలాగే తొలగించిన విషయం తెలిసిందే.
ఏదేమైనా ఎక్కువరోజులు ఈటల మంత్రివర్గంలోనే కాదు పార్టీలో ఉండలేని పరిస్దితులు ఏర్పడ్డాయి. రాజేందర్ పార్టీలో నుండి బయటకు వచ్చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమంలో చాలా చురుగ్గా వ్యవహరించి, సీనియర్ మంత్రుల్లో ఒకరైన ఈటల పార్టీ నుండి బయటకు వస్తే రాజకీయాలు స్పీడవుతాయన్న విషయం మాత్రం వాస్తవం. మరి కేసీయార్ కు ఇబ్బందులు మొదలవుతాయా ? లేకపోతే ఈటలే తెరమరుగైపోతారా ? అన్నది చూడాలి.
This post was last modified on May 1, 2021 10:05 am
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…