కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రెండు చేతులెత్తేశాయి. కోట్లాది డోసులు ఉత్పత్తి చేయలేక కంపెనీలు కూడా అవస్తలు పడుతున్నాయి. మొదట్లో 60 ఏళ్ళ వారికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్తామని కేంద్రం నిర్ణయించినపుడు డిమాండ్ ఒకమాదిరిగా ఉండేది. అప్పట్లో డిమాండ్ కు మించి సప్లై ఉన్న కారణంగా రిజిస్టర్ చేసుకున్న వారందిరికీ టీకాలు వేసే అవకాశం ఉండేది.
అయితే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు టీకాల కార్యక్రమం చాలా స్లోగా జరుగుతోందనే ఆరోపణలు ఎక్కువైపోయాయి. దీంతో టీకాలు వేయించుకునే వయసును 45 ఏళ్ళకు కేంద్రం తగ్గించింది. ఎప్పుడైతే కేంద్రం వయసును తగ్గించిందో ఒక్కసారిగా వ్యాక్సినేషన్ కోసం జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. దాంతో టీకాలకు కొరత వచ్చేసింది. దీని ఫలితంగా రెండో డోసు వేసుకోవాల్సిన వాళ్ళ డ్యూరేషన్ను కేంద్రం నాలుగు వారాల నుండి ఆరు, ఎనిమిది వారాలకు పెంచేసింది.
ఈ సమస్య పరిష్కారం కాకమునుపే టీకాలు వేసుకునే వయసును కేంద్రం 18 ఏళ్ళకు తగ్గించింది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయటం మొదలు కాలేదు. 45 ఏళ్ళ వాళ్ళకు వేయాల్సిన టీకాలే వేయలేకపోతున్నారు. లక్షలాదిమంది మొదటి డోసు, మరికొన్ని లక్షల మందికి రెండో డోసు వేయాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. అందరికీ టీకాలు వేయాలంటే కేంద్రం సరఫరా చేయాలి. కేంద్రం సరఫరా చేయాలంటే ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేయాలి.
ఒక్కసారిగా వచ్చిపడిన కోట్లాది టీకాలను ఉత్పత్తి చేయలేక కంపెనీలు చేతులెత్తేశాయి. తెలంగాణాలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు టీకాలు వేయాలంటే 3.5 కోట్ల డోసులు కావాలి. ఏపిలో వ్యాక్సినేషన్ కావాలంటే 4 కోట్ల డోసులు కావాలి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల డిమాండ్ మాత్రమే. మరి దేశమంతా 18 ఏళ్ళ యువతకు టీకాలు వేయాలంటే కనీసం 70 కోట్ల టీకాలవసరమని అంచనా.
60 ఏళ్ళు, 45 ఏళ్ళ వాళ్ళకే పూర్తిస్ధాయిలో టీకాలు వేయలని ప్రభుత్వాలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు ఏమి వేస్తుందనేది పెద్ద ప్రశ్న. ఉత్పత్తి చేయలేనపుడు, సరఫరా సాధ్యం కానపుడు 18 ఏళ్ళ యువతకు టీకాలను కేంద్రం ఎందుకు ప్రకటించిందో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే టీకాలు వేయటంలో ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని. మరి పరిస్ధితులు ఎప్పుడు చక్కబడతాయో ఏమో.
This post was last modified on April 30, 2021 11:05 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…