కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత నియంత్రణను సుప్రింకోర్టు తన చేతిలోకి తీసుకున్నట్లేనా ? తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు డైరెక్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోడిని టార్గెట్ చేసిందేనా ? అన్న చర్చ పెరిగిపోతోంది. కరోనా వైరస్ పెరిగిపోతున్న నేపధ్యంలో సుప్రింకోర్టు సూమోటోగా విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతు దేశంలో కరోనా సంక్షోభం పెరిగిపోతున్న నేపధ్యంలో సుప్రింకోర్టు ప్రేక్షక పాత్ర వహించలేదన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా చూస్తు ఎలా కూర్చుంటామని కేంద్రప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశం సంక్షోభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు యావత్ దేశం చేస్తున్నపోరాటంలో సుప్రింకోర్టు జోక్యం చాలా అవసరమని జస్టిస్ అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్ధితులు చాలా దారుణంగా మారిపోతోంది. రోజుకు 3.5 లక్షల కేసులు నమోదవుతున్నాయి. సోమ-మంగళవారాల్లో 3 వేలమందికి చనిపోయారు. ఒకవైపు టీకాలు అందక చనిపోతుంటే మరోవైపు ఆక్సిజన్ అందక కూడా రోగులు చనిపోతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, కేరళ, ఏపి, తెలంగాణా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో రోజురోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి.
ఏ రాష్ట్రంలో కూడా రోగులకు ప్రాణాధారమైన ఆక్సిజన్ సరిపడా లేవు. నిజానికి చాలామంది రోగులు కరోనా తీవ్రతకన్నా భయంతోనే చనిపోతున్నారన్నది వాస్తవం. తమకు కరోనా సోకిందని తెలియగానే కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జరుగుతున్నది చూస్తున్న జనాల్లో ఓ విధమైన భయాందోళనలు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా సంక్షోభం పెరిగిపోతుంటే కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోంది. దాంతో ఇన్నిరోజులు ఓపికిపట్టిన కేంద్రం ఇక లాభం లేదని తానే పగ్గాలను చేతిలోకి తీసుకున్నది.
This post was last modified on April 28, 2021 12:01 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…