Political News

సీఎంకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

అవును ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. ఒకరు పదిపైసలు పనిచేసి రూపాయి ప్రచారం చేసుకుంటారు. మరొకరు అర్ధరూపాయి పనిచేస్తారు. ఇంకొకరు 90 పైసలు పనిచేసి రూపాయి ప్రచారం చేసుకుంటారు. ఇదే సమయంలో మరొకరు రూపాయి పనిచేసి కూడా ప్రచారానికి దూరంగానే ఉంటారు. చివరికోవచు చెందిన ముఖ్యమంత్రే నవీన్ పట్నాయక్. అవును ఒడిస్సాను గడచిన 20 ఏళ్ళుగా పరిపాలిస్తున్న నవీన్ పట్నాయక్ పనికి ముందు ప్రచారానికి చివరన అన్నట్లుగా ఉంటారు.

తాజాగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని ఎంతలా వణికించేస్తోందో అందరు చూస్తున్నదే. గడచిన 24 గంటల్లో 3.5 లక్షల కేసులు నమోదు కావటమే కాకుండా 2900 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో కరోనాతో చనిపోయిన వాళ్ళు కొందరైతే ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఆక్సిజన్ అందక రోగులు చనిపోయారని వినటమే విచిత్రంగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఒకేసారి వేలు, లక్షలాది మంది రోగులకు ఆక్సిజన్ అవసరమవుతోంది.

ఆసుపత్రుల్లో డిమాండ్ కు తగ్గట్లు నిల్వలు లేకపోవటంతో ఒక్కసారిగి ఆక్సిజన్ కొరత పెరిగిపోతోంది. ఆక్సిజన్ కొరతన్నది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమని కాకుండా చాలా రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ ను ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం రిక్వెస్ట్ చేశారు. దీనికి నవీన్ కూడా సానుకూలంగా స్పందించారు. రూర్కెల, డెంకనాల్, అంగుల్, జైపూర్ జిల్లాల్లోని ఫ్యాక్టరీలు వెంటనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని మొదలుపెట్టేశాయి.

ఒడిస్సా మొత్తం మీద 70 భారీ ఫ్యాక్టరీలున్నాయి. ఇందులో 12 స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటవసరాల కోసం ప్రతిరోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటునే ఉంటాయి. అయితే ప్రస్తుత దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఆదేశాలివ్వగానే అదనపు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. గడచిన నాలుగు రోజులుగా తెలంగాణా, మహారాష్ట్ర, ఏపి, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సుమారు 1700 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి సరఫరా చేసింది. ఇంకా సరఫరా అవుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుత పరిస్ధితుల్లో దేశవసరాలను దృష్టిలో పెట్టుకుని వందల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తూ కూడా ఎక్కడా ప్రచారానికి పాకులాడకపోవటం. విపత్కర పరిస్ధితుల్లో ఉన్న రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి ఆదుకోవటమే టార్గెట్ గా నవీన్ పని చేస్తున్నారు. ఆదుకోవటమే టార్గెట్ కాబట్టి ఆదుకోవటంలోనే ఉన్నారు. అందుకనే ప్రచారానికి పాకులాడటంలేదు. ముందే చెప్పుకున్నట్లుగా పనికి ముందు ప్రాచారానికి చివర ఉండే నవీన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

This post was last modified on April 28, 2021 11:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

15 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

49 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago