Political News

శ‌వాల గుట్ట‌లు పేరుకున్నా.. లాక్‌డౌన్ పెట్ట‌ను

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. నిత్యం వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతు న్నారు. దీంతో గ‌త ఏడాది దాదాపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్‌ను విధించాయి. అయితే.. నెమ్మ‌దినెమ్మ‌దిగా దీనిని స‌డ‌లిస్తూ.. వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే బ్రిట‌న్‌లోనూ గ‌త ఏడాది లాక్‌డౌన్ విధించారు. ఇక‌, మొద‌టిసారి కంటే కూడా రెండోసారి లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమ‌లు చేసి.. క‌రోనాను చాలా వ‌ర‌కు నిలువ‌రించారు.

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్ కేసులు 4,406,946 కాగా, మ‌ర‌ణించిన వారి సంఖ్య 127,434గా ఉంది. అంటే.. బ్రిట‌న్ జ‌నాభా(6 కోట్ల పైచిలుకు)తో పోల్చుకుంటే.. మ‌ర‌ణించిన వారు ఎక్కువే. దీంతో ఇప్పుడు తీవ్రంగా ఉన్న క‌రోనాను ఎదుర్కొనేందుకు మూడో సారి కూడా లాక్ డౌన్ విధించాల‌ని.. అక్క‌డి ప్ర‌తిప‌క్షాలు కోరుతున్నాయి. అయితే.. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ మాత్రం లాక్‌డౌన్ విధించ‌న‌ని.. కొన్నాళ్లుగా చెబుతున్నారు. “అలాంటి ప్ర‌తిపాద‌న ప్ర‌భుత్వం వద్ద‌లేదు” అని ప్ర‌ధాని కార్యాల‌య సెక్ర‌ట‌రీ ఇట‌వ‌ల వెల్ల‌డించారు.

ఇదిలావుంటే.. మూడోసారి లాక్‌డౌన్‌పై ప్ర‌ధాని బోరిస్ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారంటూ.. ఇక్క‌డి ప్ర‌ధాన మీడియా, ప్ర‌జాద‌ర‌ణ‌, విశ్వ‌స‌నీయ సంస్థ‌గా గుర్తింపు పొందిన ‘డైలీ మెయిల్’ బాంబు పేల్చింది.

“దేశంలో మూడోసారి లాక్డౌన్ విధించడం కంటే.. గుట్టలు గుట్టలుగా మృతదేహాలు పేరుకుపోయినా ఫర్వాలేదు. అదే మేలు” అని ప్ర‌ధాని బోరిస్ అన్న‌ట్టుగా.. డైలీ మెయిల్ సంచ‌ల‌న వార్త తీసుకువ‌చ్చింది. రెండోసారి లాక్డౌన్ విధించిన సందర్భంగా 2020 చివరిలో జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ డైలీ మెయిల్ ఇటీవల తన కథనంలో పేర్కొంది.

ఇందుకు సంబంధించి ఆ పత్రిక ఎలాంటి ఆధారాలు పేర్కొనలేదు. కాకపోతే జాన్సన్ కార్యాలయం నుంచి ఈ లీకులు వచ్చినట్లు తెలిపింది. అయితే.. డైలీమెయిల్ మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ ఖండించారు. అవి పూర్తిగా చెత్త ఆరోపణలు అని ఆయన మండిపడ్డారు. దీనిపై విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశించిన‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌య వ‌ర్గాలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 27, 2021 6:10 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

53 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago