18 ఏళ్ళు నిండిన వాళ్ళు కరోన వైరస్ టీకాలు వేసుకోవటానికి మరో నెలరోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందకంటే వాళ్ళకు అవసరమైన టీకాలు ఇప్పుడిప్పుడే అందేట్లులేదు. ప్రభుత్వం ప్రకటించిన లెక్క ప్రకారమే 18 ఏళ్ళు నిండినవాళ్ళకు టీకాలు వేయాలంటే సుమారు 2 కోట్ల టీకాలు అవసరం. అంటే రెండు డోసులకు కలిపి 4 కోట్లకు పైగా టీకాలు కావాలి.
ఇపుడు 45-60 ఏళ్ళమధ్య వారికి టీకాలు వేయటానికే సరపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉండటంలేదు. దీనివల్లే మధ్య వయస్సుల వారికి కూడా టీకాల షెడ్యూల్ తేదీలను ప్రభుత్వమే మార్చేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే టీకాలను ఉత్పత్తి చేసే రెండు కంపెనీలనుండి సరపడా ఉత్పత్తి కాకపోవటమే. యావత్ దేశానికి 45-60 ఏళ్ళ వయసుల వారికి వ్యాక్సిన్లు వేయాలంటేనే వందల కోట్ల డోసులు ఉత్పత్తిచేయాలి.
ముడిసరుకు కొరత, మ్యాన పవర్ కొరత, సాంకేతిక నిపుణుల కొరత లాంటి అనేక సమస్యల వల్ల ఫార్మా కంపెనీలు కూడా అవసరానికి సరపడా టీకాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ముందు చెప్పిన వయసుల వాళ్ళకే రెండు డోసులు సక్రమంగా వేయలేకపోతున్న ప్రభుత్వాలు ఇక 18 ఏళ్ళు నిండినవారికి కూడా టీకాలు వేయాలంటే ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలో చెప్పక్కర్లేదు.
జనాలందరికీ టీకాలను అందివ్వలేని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే టీకాల విషయంలో తన బాధ్యతల నుండి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఫార్మాకంపెనీలతో నేరుగా మాట్లాడుకోవాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించి చేతులు దులిపేసుకుంది. ఫార్మాకంపెనీలేమో డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేయలేక అవస్తలు పడుతున్నాయి. ఈ కారణంగానే 18 ఏళ్ళు నిండిన వారికి టీకాలు వేయటం ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ సింఘాలే స్వయంగా చెప్పారు. మే 1 నుండి 18 ఏళ్ళు నిండినవారికి మొదలవ్వాల్సిన టీకాల కార్యక్రమం జూన్ కు వాయిదా వేసినట్లు చెప్పారు. జూన్ లో అయినా మొదలవుతుందా అంటే ఎవరు చెప్పలేకున్నారు.
This post was last modified on %s = human-readable time difference 2:32 pm
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…