నందమూరి వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఏకైక ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ కేవలం సినిమాల్లో మాత్రమే కాదు… అటు రాజకీయ రంగంలో కూడా నందమూరి వంశం పరువు నిలబెడతారన్న అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోగా ఉన్న ఎన్టీఆర్‌పై ఇప్పుడు ఎక్కడా లేని విపరీతమైన ప్రెజర్ అయితే ఉంది. ఎన్టీఆర్‌పై ఉన్న ప్రెజర్ సినిమాల గురించి కాదు.. ఆయన దూరంగా ఉంటోన్న రాజకీయాల గురించే అన్న చర్చలు నందమూరి కాంపౌండ్ వర్గాల నుంచే బయటకు పొక్కుతున్నాయి.
2009 ఎన్నికల్లో గెలుపు కోసం బాబు స్వయంగా ఎన్టీఆర్‌ను ఒప్పించి ప్రచారంలో దింపారు. కొద్ది రోజుల పాటు ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన ప్రమాదానికి గురి కావడంతో ప్రచారాం ఆర్ధాంతంగా ఆగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. తర్వాత చంద్రబాబు మేనకోడలు కుమార్తెతో ఎన్టీఆర్ వివాహం జరిగినప్పటి నుంచి ఎన్టీఆర్‌కు బాబు, బాలయ్యతో దూరం పెరుగుతూ వచ్చింది. చివరకు 2014 ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి మరీ ప్రచారానికి ఒప్పించుకున్నారు.
ఇక 2019లో పవన్ కూడా బాబుకు దూరం అయ్యారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడడంతో పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కే పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. చివరకు చంద్రబాబు సభల్లోనూ ఇదే డిమాండ్ పార్టీ కేడర్ నుంచి వినిపిస్తోంది. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఇదే మాట చెప్పారు. ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా లోకేష్‌ను మోసినా ఉపయోగం లేదని.. ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తేనే పార్టీకి పునర్వైభవం వస్తుందన్న అంచనాల్లో ఉంది.
ఇక టీడీపీనే అంటి పెట్టుకుని ఉన్న బలమైన నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చే పనిలో బిజీ అవుతున్నారట. అయితే వీళ్లంతా ఇప్పటికప్పుడు పార్టీలో కీలక స్థానం ఇవ్వడం కుదరదని.. భవిష్యత్తు అంతా నీదేగా అని ఎన్టీఆర్‌తో నర్మగర్భంగా అంటున్నారట. అంటే వచ్చే ఎన్నికల కోసం మళ్లీ ఎన్టీఆర్‌ను వాడుకునే పనిలో చంద్రబాబు & గ్యాంగ్ నిమగ్నమైందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్‌కు చాలా యేళ్ల పాటు సినీ కెరీర్ ఉంది. దానిని ఇప్పుడే పణంగా పెట్టి రాజకీయాల్లోకి వస్తారా ? మళ్లీ చంద్రబాబు కోసం ఆయన పనిచేస్తారా ? లేదా స్వతంత్య్రంగా వస్తారా ? అన్నది చూడాలి.
This post was last modified on April 14, 2021 12:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…