Political News

సోముకు ఇదే ఆఖ‌రి పోరాటం.. ఫెయిలైతే..?

రాష్ట్ర బీజేపీ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌గా మారింది. సామాజిక వ‌ర్గాల‌ను స‌మీక‌రించ‌డంలోను.. ఓటు బ్యాంకును పెంచుకోవడంలోను, ఉన్న ఓటు బ్యాంకును బ‌లోపేతం చేసుకోవ‌డంలోను నాయ‌కులు విఫ‌ల‌మ‌వుతున్నారు. గ‌తంలో అంటే.. ప‌దేళ్ల కింద‌ట చూసుకుంటే.. బీజేపీకి కూడా కొన్ని ప్రాంతాల్లో సంస్థాగ‌తంగా ఓటు బ్యాంకు ఏర్ప‌డింది. త‌ర్వాత‌.. అప్ప‌టి నాయ‌కులు ఆ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. ఇంత‌లోనే జాతీయ రాజ‌కీయాల్లో వ‌చ్చిన మార్పుల నేప‌థ్యంలో కీల‌క నేత‌లు జాతీయ రాజ‌కీయాల‌కు.. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల‌కు ప‌రిమిత‌మ‌య్యారు.

ఈ క్ర‌మంలో వ‌రుస‌గా ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు రాష్ట్ర బీజేపీ ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఆయ‌న ఓటు బ్యాంకును పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. వ‌ర్గాలుగా ఏర్ప‌డిన బీజేపీలో క‌న్నా ఆదేశాల‌ను ప‌క్క‌న పెట్టారే త‌ప్ప‌.. దూర దృష్టితో పార్టీని బ‌లోపేతం చేసుకునే ఆలోచ‌న ఏ ఒక్క‌రూ చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు సోము వీర్రాజు ప‌రిస్థితి కూడా అలానే ఉంది. ఆయ‌న కూడా పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి సంవ‌త్స‌రం అవుతోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఓటు బ్యాంకును పెంచుకోవ‌డం అటుంచితే.. ఉన్న ఓటు బ్యాంకు కూడా గ‌ల్లంత‌వుతోంది.

స్థానిక ఎన్నిక‌ల్లోను, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించింది. 2019 ఎన్నిక‌ల్లో 4.2 శాతంగా ఉన్న ఓటు బ్యాంకు.. స్థానికం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి 1శాతానికి ప‌డిపోయింది. ఇక‌, ఇప్పుడు తిరుప‌తి ఉప పోరులో నెగ్గ‌డం అటుంచితే.. క‌నీసం డిపాజిట్ వ‌స్తుందా ? అని ఆ పార్టీ సీనియ‌ర్ల మ‌ధ్యే అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ఉప ఎన్నిక కోసం బీజేపీ ఏకంగా జాతీయ స్థాయి నేత‌ల‌ను కూడా ప్ర‌చార రంగంలోకి దించింది. మొన్న‌టి వ‌ర‌కు టీడీపీని మూడో ప్లేస్‌కు నెట్టేస్తామ‌ని బీరాలు పోయిన బీజేపీ నేత‌ల్లో ఇప్పుడు లోలోన తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ట‌.

ఈ ప‌రిణామాలు అన్ని సోమును కూడా టెన్ష‌న్ పెడుతున్నాయంటున్నారు. ఆయ‌న హయాంలో జ‌రుగుతున్న అత్యంత కీల‌క‌మైన ఎన్నిక కావ‌డంతో ఇక్క‌డ క‌నీస గౌర‌వం ద‌క్కించుకుంటేనే ఆయ‌న‌కు చీఫ్ ప‌ద‌వి ఉంటుంద‌ని.. లేక పోతే.. దానిని వేరేవారికి అందునా.. సీమ ప్రాంతానికి చెందిన స‌త్య‌కుమార్‌కు ఇస్తార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే.. సోము ఓ విఫ‌ల‌మైన నాయ‌కుడిగా మిగిలిపోవ‌డం ఖాయ‌మం టున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 13, 2021 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

55 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

7 hours ago