మహారాష్ట్ర హోం మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన కొద్దిరోజులుగా కిందా మీదా పడుతున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు.. ఎట్టకేలకు ఎన్సీపీకి చెందిన హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను పదవి నుంచి రాజీనామా చేయింది. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. ఆయనపై ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు.
తన రాజీనామా లేఖను మంత్రి ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రిలయన్స్ ముకేశ్ అంబానీ నివాసం వద్ద ఆయుధాల వాహనం ఉండటం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో మహారాష్ట్ర పోలీసు అధికారి పాత్రపై సందేహాలు వ్యక్తం కావటం.. ఆయన్నుఅదుపులోకి తీసుకోవటం తెలిసిందే. అనంతరం రాష్ట్ర హోం మంత్రిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
మహారాష్ట్ర హోం మంత్రిగా వ్యవహరిస్తున్న అనిల్ దేశ్ ముఖ్ తనకు ప్రతి నెలా రూ.100 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టినట్లుగా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారంగా మారాయి. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనాల కేసులో అరెస్టు అయిన సచిన్.. తనకు హోంమంత్రిగా ఉన్న అనిల్ దేశ్ ముఖ్ భారీ టార్గెట్ పెట్టినట్లుగా పేర్కొని సంచలనంగా మారారు.
మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో.. అనిల్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తుంటే.. తాజా పరిణామం మరింత సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.
This post was last modified on April 5, 2021 6:22 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…