మయున్మార్ లో 43 మంది చిన్నారులను చంపేశారు. గడచిన నాలుగురోజులుగా సైన్యానికి, ప్రజలకు మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో చట్టబద్దంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీతో పాటు మరికొందరిని సైన్యం నిర్భందించి జైళ్ళల్లో పెట్టింది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యాధికారులే మయున్మార్ పాలనా పగ్గాలను చేతిలోకి తీసుకున్నారు.
సైన్యం చర్యతో రెచ్చిపోయిన జనాలు వెంటనే రోడ్లపైకి వచ్చి తిరగబడ్డారు. రోడ్లపైకి రావద్దని, ఆందోళనలు చేయవద్దని సైన్యం చెప్పిని వినకుండా జనాలు రోడ్లపైకి వచ్చి దేశమంతా ఆందోళనల్లోకి దిగారు. దాంతో సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. గడచిన నాలుగు రోజులుగా 600 మందకి పైగా సైన్యం, పోలీసుల కాల్పుల్లో మరణించారు.
బాధాకరమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో 43 మంది చిన్న పిల్లలు కూడా ఉండటం. మరణించిన వారిపై సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్చంధ సంస్ధ సర్వేచేసింది. చనిపోయిన వారిలో 16 ఏళ్ళలోపు వారు 30 మందున్నారట. 13 ఏళ్ళ చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుంటే అకారణంగా సైన్యం కాల్పులు జరిపి చంపేసిందని సంస్ధ ఆరోపించింది.
మండలేలో కూడా 14 సంవత్సరాల అబ్బాయి ఇంటిముందున్నపుడు సైన్యం కాల్చి చంపేసిందట. కరేన్ తెగ ఎక్కువగా ఉండే గ్రామంపై సైన్యం జరిపిన కాల్పుల్లో చాలామంది పిల్లలు చనిపోయినట్లు సంస్ధ ప్రతినిధులు వెల్లడించారు. ఇళ్ళల్లోనే ఉన్నవారిపైన కూడా దాడులు జరిపి కాల్చి చంపేస్తున్నారంటే సైన్యం+పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాయో అర్ధమైపోతోంది. అంతర్జాతీయ సమాజం ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సైన్యం, పోలీసులు ఎవరినీ లెక్కపెట్టడంలేదు. మరి ఈ దమనకాండ ఎంతకాలం సాగుతుందో ఏమో.
This post was last modified on April 3, 2021 11:18 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…