సాధారణ నాయకులు, లేదా ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు వర్గ పోరులో నలుగుతున్నారంటే అర్థం ఉంటుంది. వారు ఇప్పుడు కాకపోతే.. ఎన్నికల ముందు అయినా.. తమను తాము సరిదిద్దుకుని.. లేదా కేడర్‌ను దారిలో కి తెచ్చుకుని ముందుకు సాగే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, ఇప్పుడు సాక్షాత్తూ ఓ మంత్రి వర్గ పోరులో ఇరుక్కుపోతున్నారు. ఆయనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆయన గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. ఇక్కడ నుంచి గెలవడం అయితే.. గెలిచారు కానీ.. ఇక్కడ పట్టుమని పది రోజులు కూడా ఆయన ఉండడం లేదు.
అయితే.. విజయవాడ లేకపోతే. హైదరాబాద్.. అదీకాకపోతే.. తిరుపతి అన్న విధంగా మకాం మారుస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆయన గెలుపునకు కృషి చేసిన నాయకులు.. పార్టీ కేడర్‌ను ఆయన పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క కార్యక్రమానికి వచ్చినా.. వెంటనే చేతులు దులుపుకొని వెళ్లిపోతున్నారు. ఏడాదిపాటు ఈ పరిస్థితిని గమనించిన పార్టీ కేడర్ ఇప్పుడు విసిగి పోయారు. దీంతో ఎస్సీ వర్గంలోనే రెండుగా చీలిపోయి.. ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. వీరిలో ఓ వర్గం ఏకంగా వచ్చే ఎన్నికల్లో సురేష్‌ను ఓడించేందుకు కృషి చేస్తామని.. అంతర్గతంగా ప్రకటనలు చేస్తుండడం సంచలనం రేపుతోంది.
సురేష్ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ కులానికి ఓ నేతను పెట్టుకుని వారితోనే ప్రజల పనులు చక్కపెట్టించేస్తున్నారు. ఇది కూడా ఆయనకు మైనస్ అయ్యింది. ఇక మరో వర్గం ఏకంగా స్థానిక మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తోంది. ఎస్సీలను పట్టించుకోని ఎస్సీ నాయకుడు, మంత్రి అయ్యాక.. మరిచిపోయిన నేత.. అంటూ.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ ప్రచారం చేయిస్తున్నారు. అయితే.. ఇలాంటి ప్రచారం ఇది కొత్తకాదు.. గత ఆరు మాసాలుగా జరుగుతోంది. అయినప్పటికీ.. మంత్రి మాత్రం ఎవరినీ లెక్క చేయడం లేదు. దీనికి మరో కారణం కూడా ఉంది.
ఆయన ఇప్పటి వరకు నికరంగా ఒక నియోజకవర్గాన్ని నమ్ముకుని ఎక్కడా పనిచేయలేదు. ఎన్నికల సమయానికి అవసరమైతే.. నియోజకవర్గం మారిపోవడం ఆయనకున్న నైజం అన్న విమర్శలు కూడా పార్టీ నేతల్లోనే ఆయనపై ఉన్నాయి. దీంతో వీరిని అందుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక 2014 లో ఇక్కడ నుంచి గెలిచి పార్టీ మారిన డేవిడ్ రాజు ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నారో ఇప్పుడు సురేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
This post was last modified on April 2, 2021 10:39 am
ఏపీలో 30వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ 2024 ఎన్నికలకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత, ఏపీ…
ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…
శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమై తన గ్లామర్ తో కుర్ర కారు…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…