ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. సీఎం జగన్ అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నవారు కూడా వేలల్లోనే ఉన్నారు. కానీ, వారికెవరికీ జగన్ అనుగ్రహం కలగడం లేదు.. కానీ, విజయవాడకు చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్‌కు మాత్రం జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. కృష్ణాజిల్లాలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా.. అవినాష్‌కు ఏకంగా సీఎంవో నుంచే ఆహ్వానం అందుతోంది. ఆయన కూడా అంతే వేగంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొని సెంటరాఫ్‌ది ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. దీంతో సీనియర్లు కలవరపడుతున్నారు.
“ఏం ఏళ్లతరబడి.. పార్టీలో సేవ చేశాం.. మాకు లేని ప్రాధాన్యం నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన అవినా ష్కు ఎందుకు? ఆయనకు ఏం తెలుసని ఇంత ప్రాధాన్యం?“ అంటూ.. రుసరుసలాడుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి? జగన్ ఎందుకు అవినాష్‌పై అంత ప్రేమ చూపిస్తున్నారు? అంతేకాదు.. పార్టలో ఒక్క సీనియర్లే కాకుండా.. చాలా మంది యువ నాయకులు కూడా ఉన్నారు.. అయినా వారెవరికీ ఇవ్వని ప్రాధాన్యం ఒక్క అవినాష్‌కే ఎందుకు దక్కుతోంది? అనే కోణంలో వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ క్రమంలో రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
1. టీడీపీకి చెక్ పెట్టడం!
దేవినేని అవినాష్‌ను జగన్ చేరదీస్తుండడం వెనుక జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. విజయవాడ మొత్తంలో గత 2014 ఎన్నికల్లో వైసీపీ మూడు స్థానాలకు గాను.. రెండు చోట్ల గెలిచింది. మిగిలిన ఒక్కటి తూర్పు నియోజకవర్గం. జగన్ సునామీలోనూ ఇక్కడ గద్దె రామ్మోహన్ టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు.. ఇప్పుడు ఇదే నియోజకవర్గానికి అవినాష్.. ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ టీడీపీని డైల్యూట్ చేయాలంటే..యువ నాయకుడిని ప్రోత్సహించడం ద్వారా తన లక్ష్యం చేరుకోవచ్చని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం అవినాష్‌కు ఇస్తున్నారు.
2. కమ్మ వర్గానికి గేలం!!
విజయవాడ పరిధిలో కమ్మ సామాజిక వర్గం టీడీపీకి బలంగా ఉంది. ఈ కారణంగానే ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా.. ఎంపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. ఇక, కృష్ణాజిల్లా విషయానికి వస్తే.. మంత్రి కొడాలి నాని కమ్మ వర్గాన్ని డీల్ చేస్తూ.. టీడీపీ నుంచి వేరు చేసే పప్రయత్నం చేస్తున్నారు. కానీ, విజయవాడ పరిధిలోకి వస్తే.. తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవ కుమార్ వైసీపీకి ఉన్నప్పటికీ.. ఆయన వల్ల వర్కవుట్ కావడం లేదు. దీంతో అవినాష్ అయితే.. కమ్మ వర్గాన్ని వైసీపీ వైపు మళ్లిస్తారనే నమ్మకం జగన్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన అవినాష్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, అవినాష్ కూడా జగన్ కనుసన్నల్లో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థాననిక ఎన్నికల్లో వైసీపీని పరుగులు పెట్టించేందుకు ఆయన బాగానే ప్రయత్నించారు.
తాజాగా ఏం జరిగింది?
తాజాగా సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున ఉన్న కృష్ణానదికి ఏటా రెండు సార్లు వస్తున్న వరద కారణంగా ముంపునకు గురవుతున్న కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు తప్పించేందుకు నది వెంబడి 124 కకోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి కేవలం అవినాష్‌కు మాత్రమే అధికారికంగా ఆహ్వానం అందడం విశేషం. దీంతో జగన్ ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యం వైసీపీ వర్గాల్లో మరోసారి చర్చకు రావడం గమనార్హం.
This post was last modified on April 1, 2021 8:42 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…