ఏపీలో బలంగా ఉన్నామని… ఇక, తమకు తిరుగులేదని చెప్పుకొంటున్న జగన్ సర్కారుకు.. అదే పార్టీలో ఇప్పుడు చెలరేగుతున్న ముసలం.. కలకలం సృష్టిస్తోంది. ఇదేం రాజకీయం సార్!
అంటూ.. రోజూ.. వివిధ జిల్లాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి సందేహాలు, ఫోన్లు కూడా వస్తున్నాయి. మేం పార్టీ కోసం ఎంతైనా కష్టపడతాం. ఇప్పటి వరకు మా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ పార్టీని డెవలప్ చేశాం. కానీ.. మీరు మాకు ఇచ్చిన హామీలు ఏం చేశారు. ఇప్పుడు పార్టీలో మాకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇదేం రాజకీయం సార్
-ఇదీ తాజాగా నంద్యాల ఎమ్మెల్యే నుంచి పార్టీకి అందిన సందేశం.
రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉంది. దీనికి జగన్ ఒక్కరే రీజనని అంటున్నారు. నాయకులు, జెండా మోసేవారు లేకపోతే... జగన్ ఎక్కడో ఆలోచించుకోవాలి!
-గుంటూరుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సంధించిన ప్రశ్న. ఇలా.. ఏ ఒక్కరో ఇద్దరో కాదు… దాదాపు స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇప్పటి వరకు సుమారు 25 మంది కీలక నేతల నుంచి అందిన సందేశాలు ఇవే. దీంతో పార్టీలో అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? అని!! గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారిలో సగంమందికి ఇస్తామన్న పదవులు ఇవ్వలేదు. ఇక, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇంకేముంది.. మీరు గెలిపించండి.. మేయర్, చైర్మన్ పదవులు మీవారికేనని కీలక నేతలు ఊరించారు.
దీంతో ఉత్సాహంగా ముందుకు ఉరికి పనిచేసిన కీలకనేతలు కార్పొరేషన్లను కైవసం చేసుకున్నారు.. స్థానికంగా పార్టీని గెలిపించుకున్నారు.. తీరా చూస్తే.. పార్టీ గెలిచిన తర్వాత.. పదవుల లెక్కలు మారిపోయాయి. దీంతో నాయకుల్లో ఒక విధమైన అభద్రతా భావం పెరిగిపోయింది. `పనిచేసేది మేం. ప్రజల్లో తిరిగేది మేం. పదవులు మాత్రం మీకు నచ్చిన వారికి ఇస్తున్నారు“ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిణామానికి ఇప్పుడు కనుక వైసీపీ చెక్ పెట్టకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి ఇది వ్యతిరేకతగా మారిపోయి.. పార్టీ ఓటమికి దారితీసిననా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే.. జగన్ విశ్వసనీయతే.. ప్రశ్నార్థకంగా మారుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ ముందుగానే కళ్లు తెరుస్తుందో.. లేక.. తమ ఇష్టం అమలు కావాలని పట్టుబడుతుందో చూడాలి.
This post was last modified on March 28, 2021 9:28 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…