Political News

పార్టీ నేతలే కొంప ముంచేశారా ?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత టీడీపీలో వినిపిస్తున్న విశ్లేషణను బట్టి ఇలాగే అనుకోవాలి. పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ అధ్యక్షుడిని నియమించారు. అయితే వాళ్ళలో చాలామంది క్షేత్రస్ధాయిలోకి వెళ్ళి పనిచేయలేదట. పార్టీ నేతలను సమన్వయం చేసుకోవటంలో చాలామంది ఫెయిలైనట్లు సమాచారం.

కరోనా వైరస్ పుణ్యామని మున్సిపల్ ఎన్నికలకు దాదాపు ఏడాది గడువొచ్చింది. ఇందులో ఓ ఆరుమాసాలను తీసేసినా మిగిలిన ఆరుమాసాల్లో పార్టీ సీనియర్లలో అత్యదికులు పార్టీని పట్టించుకోలేదనే వాదన బయటకు వస్తోంది. చివరకు పాలిట్ బ్యూరో సభ్యుల్లో చాలామంది పార్టీని తమ జిల్లాల్లో గాలికొదిలేశారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కొందరు ఇన్చార్జిలు మాత్రమే శక్తివంచన లేకుండా కష్టపడినా ఉపయోగం లేకుండాపోయింది.

పాలిట్ బ్యూరోలో కానీ లేదా రాష్ట్ర, జాతీయ స్ధాయి కమిటిల్లోని నేతల్లో చాలామందికి క్షేత్రస్ధాయిలో బలమే లేదు. 24 గంటలూ మీడియా సమావేశాల్లోనో లేకపోతే టీవీ డిబేట్లలోనో కాలం గడిపేస్తుంటారని పార్టీ వర్గాలు ఇపుడు మండిపోతున్నాయి. పార్టీ బలోపేతానికి కష్టపడేవారిని, పైపైన కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే వారిని చంద్రబాబు ఒకేలా ట్రీట్ చేస్తుండటమే విచిత్రంగా ఉందంటున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన వారు, పదవులు అందుకున్న వారు, ఆర్ధికంగా బలోపేతమైన నేతల్లో గడచిన రెండేళ్ళుగా ఎంతమంది క్రియాశీలంగా ఉన్నారో లెక్కలు తీయమని పార్టీ క్యాడర్ నిలదీస్తున్నారు. పై క్యాటగిరిల్లోని వాళ్ళల్లో అత్యధికులు కేవలం షో మాత్రమే చేస్తున్నారని, చాలామంది అసలు పార్టీలో కనబడటం లేదని మండిపోతున్నారు. సంస్ధాగతంగా పార్టీని బలోపేతం చేయటంలో చంద్రబాబు దృష్టి పెట్టనపుడు ఇక నేతలు మాత్రం ఎందుకు కష్టపడతారనే వాదన కూడా వినబడుతోంది.

తెలుగుయువత, తెలుగు రైతు లాంటి అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించిన చంద్రబాబు కమిటిలను మాత్రం వేయలేదు. కమిటిల నియామకాల విషయంలో ఎన్నిసార్లు ప్రస్తావించినా చంద్రబాబు దృష్టి పెట్టలేదు. దాంతో అధ్యక్షులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి అనేక లోపాల కారణంగానే పార్టీ పుట్టి ముణిగిపోయిందని నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ముణిగిపోయింది లేదని రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని నేతలు అడుగుతున్నారు. మరి చంద్రబాబు ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on March 16, 2021 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు స్ట్రాట‌జీ: జ‌గ‌న్ ఓటు బ్యాంకుకు భారీ గండి!

సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాల‌న్న కాంక్ష‌తో వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్న చంద్ర‌బాబు.. అదే సమ‌యంలో తాను తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో వ‌చ్చే…

20 minutes ago

రేవంత్ వర్సెస్ కేటీఆర్!… హీటెక్కిపోయింది!

తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరోమారు మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి సీఎం ఎనుముల…

1 hour ago

ఆ రెడ్డిగారంతే.. మార‌రంట‌… !

రెడ్డినేతలందు.. ఈ రెడ్డి వేర‌యా! అని అనిపిస్తున్నారు నెల్లూరు జిల్లా రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి. హార్డ్ కోర్…

2 hours ago

ప‌వ‌న్ సిఫార‌సు ఓకె చెప్పిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. హిందువుల చిర‌కాల కోరిక‌ను తీర్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. దాదాపు ఐదు ద‌శాబ్దాల‌కు పైగా హిందువుల‌కు చెందిన ధార్మిక…

2 hours ago

మోక్షజ్ఞ కోసం ఇంకో ఏడు నెలలు

ఎదురుచూసి చూసి అలిసిపోయిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. గత…

2 hours ago

అమెరికా బోటు ప్రమాదంలో ఇద్దరు భారతీయ చిన్నారుల గల్లంతు

అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఓ బోటు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు చిన్నారులు గల్లంతు అయ్యారు. పిల్లల తల్లిదండ్రులు…

2 hours ago