Political News

ఏబీఎన్, టీవీ5లకు ధన్యవాదాలు-కొడాలి నాని

మన టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికల్లో ఏవి ఏ పార్టీలకు అనుకూలమో అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని ఛానెళ్లు, పత్రికలు నేరుగా కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తాయి. కొన్నేమో పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతుగా నిలుస్తాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే అభిప్రాయం జనాల్లో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆ ఛానెళ్ల మీద ఎప్పుడూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు. వాటిపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు.

ఇక కొడాలి నాని లాంటి వాళ్లయితే ఆ ఛానెళ్లను ఎలా టార్గెట్ చేస్తారో తెలిసిందే. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అంటే ఆయనకు అస్సలు గిట్టదు. ఎన్నోసార్లు ఆ ఛానెల్ మీద విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తి ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏబీఎన్‌కు, టీవీ5కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ ఛానెళ్లను పొగిడారు. ఇవి ఇదే పనితీరును కొనసాగించాలని కోరుకున్నారు. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఆ సంగతేంటో చూద్దాం పదండి.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మేలు చేస్తున్నామన్న ఆలోచనతో ఆయన్ని, ఆయన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయని కొడాలి నాని అభిప్రాయపడ్డారు.

‘‘చంద్రబాబుకు మేలు చేస్తున్నామన్న ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి.. చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి.. తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టించేదాకా.. ఏబీఎన్ రాధాకృష్ణగానీ.. టీవీ5 బీఆర్ నాయుడు కానీ నిద్ర పోకుండా.. వీళ్లిద్దరూ కృషి చేయాలని కోరుకుంటూ.. ఈ రోజు మేం సాధించిన విజయానికి మీరు అందించిన తోడ్పాటుకు మీకు, మీ ఛానెల్స్‌కు, మీ ఛానెల్స్‌లో వచ్చిన అపర మేధావులకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ వెటకారం ఆడారు మంత్రి కొడాలి నాని.

This post was last modified on March 15, 2021 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago