ఎన్నికల ఫలితాలు ప్రజల నాడిని చెప్పేవన్నది పాక్షిక సత్యం మాత్రమే. ఒక ఎన్నికలో ఒక పార్టీ గెలుపు ఓటముల్ని ప్రజలు నిర్ణయించేది నిజమే అయినా.. వాస్తవం మరోలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. నిజం కొన్ని సార్లు మనకు నచ్చకపోవచ్చు అయినా నమ్మాల్సిందే. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జగన్ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయాన్నిసాధించింది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఆ విజయాన్ని తక్కువ చేసి చూపటం తప్పే, అతిశయోక్తులు చేసి చెప్పడమూ తప్పే అవుతుంది.
తాజా విజయంతో చంద్రబాబు పని అయిపోయిందని.. ఆయన ఔట్ డేటెడ్ అయిపోయారని.. జగన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారంటూ.. తమకున్న కోపాన్ని తీర్చుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. ఇలాంటి వారికి ఏం చెప్పినా.. ‘పచ్చ’రంగు పులిమేయటం ఖాయం. అందుకే.. కాస్త పాతదే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్ని గుర్తు చేయటానికి ఒకప్పుడు జగన్ చెప్పిన మాటల్నే వినిపించాల్సిన పరిస్థితి.
నంద్యాల ఉప ఎన్నికలో నాటి అధికార టీడీపీ విజయం సాధించటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలవటానికి విపక్షం ఎంతగా ప్రయత్నిస్తే.. అంతకు రెట్టింపు ప్రయత్నాల్ని చేపట్టి.. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు నాటి బాబు పరివారం. ఆ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నిక విజయంపై వైఎస్ జగన్ ఎలా స్పందించారన్నది ఈ వీడియోను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎవరేం చేసినా అంతిమంగా గెలుపు గెలుపే కదా? దాన్ని ఎందుకు అంగీకరించరంటూ వైసీపీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు.
గెలుపు గెలిపే. మరి.. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబును జగన్ అభినందించారా? అన్న ప్రశ్నకు కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. గెలుపోటముల్ని వ్యక్తిగతంగా తీసుకునే పరిస్థితి నేతల్లోనే కాదు.. వారి అభిమానుల్లోనూ ఎక్కువైంది. అదిప్పుడు ఎంతలా వెళ్లిందంటే.. ఎదుటోడి విజయాన్ని ఒప్పుకోవటమంటే తమకు వ్యక్తిగతంగా తగిలిన దెబ్బలా భావిస్తున్నారు. ఇలాంటివేళ.. ఎవరి వాదన వారిదే తప్పించి.. ఎదుటోడి విజయాన్ని ఒప్పుకునే అవకాశం ఎందుకు ఉంటుంది? నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీపై నాటి విపక్ష నేత జగన్ ఎన్ని నిందలు వేశారు.. ఆ విజయానికి ఆయన వినిపించిన వాదన.. తాజా మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు వర్తించదు?
ఒకటి మాత్రం వాస్తవం. అధికారపక్షం బలంగా ఉన్నప్పుడు.. అందునా జగన్ లాంటి సర్కారు పవర్లో ఉన్నప్పుడు ఫలితం భిన్నంగా ఎందుకు ఉంటుంది? మరో మూడేళ్లు అధికారంలో ఉండే పార్టీని కాదని.. విపక్షానికి ఓట్లు వేసే అవకాశం ఎందుకు ఉంటుంది? ఇప్పుడే కాదు.. గతంలో మరెప్పుడూ కూడా అధికారపక్షానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భాలు చాలా అరుదు.. ప్రత్యేకమన్నది మర్చిపోకూడదు. ఏతావాతా చెప్పేదేమంటే.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ని చూసి హడావుడి చేసే వారు.. జగన్ తనకు తానుగా అన్న మాటల్ని ఒక్కసారి వింటే.. విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.
This post was last modified on March 15, 2021 3:33 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…