తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సీన్ ఏమిటో అర్ధమైపోయినట్లుంది. మొత్తం 75 మున్సిపాలిటీల్లో 2123 వార్డులున్నాయి. వీటిల్లో 490 వార్డులు ఏకగ్రీవమైపోయాయి. వీటిల్లో అత్యధికం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన 1632 వార్డుల్లో 1269 చోట్ల అధికార వైసీపీనే గెలిచింది. వైసీపీ తిరుగుబాటు అభ్యర్ధులు 45 వార్డుల్లో గెలిచారు.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ 265 వార్డుల్లో గెలిచింది. మరో 2 చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్ధులు గెలిచారు. జనసేన 18 వార్డుల్లో గెలిచింది. మరి దాని మిత్రపక్షమైన బీజేపీ ఎన్ని వార్డుల్లో గెలిచింది ? ఎన్నింటిలో అంటే కేవలం 7 వార్డుల్లో మాత్రమే. సీపీఐ 3, కాంగ్రెస్1, సీపీఎం 1 వార్డులో గెలిచాయి. స్వతంత్రులు 21 వార్డుల్లో గెలవటం గమనార్హం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ నేతలు తమ స్ధాయికి మించి మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని పదే పదే చెబుతున్నారు. నరేంద్రమోడి సారధ్యంలో బీజేపీ బలపడుతోందని గంభీరంగా ప్రకటనలు చేస్తున్నారు. హోలు మొత్తం మీద చూస్తే గెలిచింది 7 వార్డుల్లో. అంటే బీజేపీ స్ధాయి ఏమిటనేది స్పష్టమైపోయింది.
కమలంపార్టీకి మరీ ఇంత ఘోరమైన పరిస్ధితి ఎందుకు వచ్చింది ? ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే ప్రదాన కారణమని అర్ధమవుతోంది. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి రాష్ట్రప్రయోజనాల విషయంలో చాలా నెగిటివ్ గా వెళుతున్నారు. విభజన చట్టంలో చెప్పిన హామీలన్నింటినీ గాలికొదిలేశారు. విభజన చట్టాలను తుంగలో తొక్కేయటమే కాకుండా విశాఖ స్టీల్స్ ను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం కూడా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది.
నిజానికి బీజేపీ మొదటి నుండి కూడా బలమైన పార్టీ కాదు. ఏదో దేశం మొత్తంమీద బీజేపీ గాలుంటేనే రాష్ట్రంలో కమలంపార్టీకి నాలుగు సీట్లొస్తాయి. లేకపోతే చతికిల పడిపోతుంది. 2014లో నాలుగు అసెంబ్లీలను, రెండు ఎంపి సీట్లలో గెలిచిందంటే మోడి వేవ్ లోనే. అదే 2019 ఎన్నికలకు వచ్చేసరికి గుండుసున్నా. అదే తాజా మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీటైంది. రేపటి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా ఇదే రిజల్టు వస్తుందనటంలో సందేహమే లేదు.
This post was last modified on March 15, 2021 6:41 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…