కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మచిలీపట్నం. ఇక్కడ నుంచి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నాయకుడు కొనకళ్ల నారాయణ విజయం సాధించారు. పార్లమెంటులో మచిలీపట్నం పోర్టు సహా అనేక సమస్యలను ప్రస్తావించి.. పరిష్కరించేందుకు కృషి చేశారు. అయితే.. గత 2019 ఎన్నికల్లో జగన్ సునామీ సహా.. అధికార టీడీపీకి ప్రజలు దూరం కావడంతో కొనకళ్ల నారాయణ ఓడిపోయారు. ఇక, ఇక్కడ నుంచి బాల శౌరి.. వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే.. ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గంలో పర్యటించింది లేదనేది ఇక్కడి వారి మాట.
2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. బాలశౌరి ఒకటి రెండు సార్లు తప్ప.. నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకున్నది లేదని కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. కరోనాకు ముందు.. తర్వాత కూడా.. ఢిల్లీలోనే మకాం వేసిన.. బాలశైరి.. కేవలం సీఎం జగన్ ఆశీస్సుల కోసమే పనిచేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆయన ఏపీకి వచ్చినా.. తాడేపల్లిలో మకాం వేసి.. సీఎం జగన్‌ను కలిసి.. మళ్లీ తిరుగుటపాలో ఢిల్లీకి వెళ్లిపోతున్నారు. అంతేతప్ప.. పార్లమెంటు పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు.. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
దీంతో ఇప్పుడు మచిలీపట్నంలో మా ఎంపీగారు ఎక్కడ? అనే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం పుంజుకునే ప్రయత్నాలు చేస్తోందా? అంటే.. అది కూడా పెద్దగా కనిపించడం లేదు. మంత్రి పేర్నినాని దూకుడుతో టీడీపీ వర్గాలు సైలెంట్ అవుతున్నాయి. ఏం చేస్తే.. ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ప్రజలకు సమస్యలు పరిష్కరించేవారు కరువయ్యారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఇదే పద్ధతి కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో బాలశౌరికి ఇక్కడ ఎదురు దెబ్బతగలడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 14, 2021 10:19 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…