రాష్ట్ర అధికార పార్టీ వైసీపీకి కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇస్తున్న ప్రాధాన్యంపై.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. మా కంటే.. వైసీపీ నాయకులే ఎక్కువా ? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇటీవల విశాఖ ఉక్కు విషయంలో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లారు. సుమారు రెండు రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే.. వారికి అప్పాయింట్‌మెంట్ లభించలేదు. పైగా అసలు మీకు విశాఖ ఉక్కుతో ఏం పని.. అవసరమైతే.. ఆ జిల్లాను వదిలేసి.. మిగిలిన జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
ఈ పరిణామం.. రాష్ట్ర బీజేపీ నేతలకు శరాఘాతంగా మారింది. అయితే.. ఇదే సమయంలో వైసీపీ నేతలకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం.. ముఖ్యంగా కడప నేతలుగా ఉన్న వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్‌రెడ్డిలకు కేంద్ర పరిశ్రమల మంత్రి అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం విశాఖ ఉక్కు విషయంలో తీరికగా వారితో చర్చించడం వంటివి రాష్ట్ర బీజేపీ నేతలకు ఇబ్బందిగా పరిణమించింది. మేం కూడా విశాఖ ఉక్కు విషయంలో ఇక్కడివారి మనోభావాలను చెప్పాలని అనుకున్నాం.కానీ, మాకు అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఇలా అయితే.. మేం విశాఖ ఉక్కు విషయాన్ని పట్టించుకోవడం లేదన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలా అయితే..ఎలా? అని గుంటూరుకు చెందిన కీలక నాయకుడు ఒకరు ఆఫ్ ది రికార్డుగా ప్రశ్నించారు.
దాదాపు ఇదే విధంగా మిగిలిన నాయకులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నాక.. దాని నుంచి ఇప్పటి వరకు వెనక్కి తగ్గలేదు. అయితే.. దీనికి ముందు, రాష్ట్ర ప్రజల మనోభావాలను చెప్పుకొనేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వాలి కదా ?! అలా ఇవ్వకపోతే.. బ్యాడ్ సంకేతాలు వెళ్తాయి. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు గమనించడం లేదు అని తూర్పు గోదావరికి చెందిన మరో నేత వ్యాఖ్యానించారు.
అయితే.. అదే సమయంలో వైసీపీ నేతలకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడాన్ని విశాఖ ఉక్కుపై చర్చించడాన్ని వారు తప్పుపడుతున్నారు. పార్టీని నడిపించాల్సింది.. ప్రజలలోకి తీసుకువెళ్లా ల్సింది తామేనని.. కానీ, తమను పట్టించుకోకపోతే.. ఎలా? అనేది వీరి ఆవేదనగా ఉంది. మరి ఇప్పటికైనా కేంద్రంలోని పెద్దలు పట్టించుకుంటారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on March 13, 2021 8:29 pm
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…