Political News

షర్మిల పార్టీలో వినిపించనున్న సోమన్న పాట

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్న సామెత.. షర్మిల తెలంగాణ రాజకీయ ప్రయత్నాల్ని చూసినంతనే గుర్తుకు రాక మానదు. ఆమె రాజకీయ పార్టీ పెడుతుందన్నంతనే ఎవరూ నమ్మలేని పరిస్థితి. తెలంగాణలో షర్మిల పార్టీ ఎలా పెడతారు? అన్న ప్రశ్న పలువురికి వచ్చింది. రాజన్న కుమార్తెగా.. జగన్ సోదరిగా.. ఆమెకున్న రాజకీయ విజన్ ను అందరూ తక్కువగా అంచనా వేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఎంతో కష్టమనుకున్న అంశాల్ని ఒక్కొక్కటిగా ఆమె అధిగమిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఆమె పెట్టే పార్టీలోకి చేరేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న సిద్ధం కావటం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. సోమన్న అంత చిన్న వ్యక్తేం కాదు. తన ఆటతో పాటతో తెలంగాణలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న అతి కొద్ది మంది కళాకారుల్లో ఒకడు. అంతేకాదు.. అతడికి ఉన్న రాజకీయ అనుభవాన్ని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. పలువురు నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల్ని చూసినప్పుడు.. తొలిదశలోనే షర్మిల పార్టీలోకి వెళుతున్న వైనం కొత్త అంచనాలకు తెర తీస్తుందని చెప్పాలి.

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా.. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలో ఉన్న చెరుకు సుధాకర్ లాంటి వారికి సోమన్న చాలా దగ్గర మనిషి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. షర్మిల పార్టీకి మద్దతు పలుకుతున్నారు. దీంతో.. షర్మిలను తెలంగాణ ప్రజలు ఆమోదిస్తారా? అన్న ప్రశ్నకు.. కరడుగట్టిన సోమన్న లాంటి ప్రజా కళాకారుడే ముందుకు వచ్చినప్పుడు.. మిగిలిన వారి సంగతేముందన్న మాట వినిపిస్తోంది.

ప్రస్తుత తెలంగాణ పరిస్థితి.. నా రాజకీయ భవిష్యత్ సంబంధించిన అంశాల్నిఆలోచన చేసి.. దివంగత నేత వైఎస్ కుమార్తె షర్మిలతోమాట్లాడి ఆమెకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే తాను తీసుకున్న నిర్ణయమే సరైనదని భావించినట్లుగా సోమన్న చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఆలోచన తనకు లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేక.. సీనియర్లు సైతం వారి భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్న సందర్భంలో తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతూర్తి నియోజకవర్గంలోని వెలిశాల గ్రామానికి చెందిన సోమన్న.. తన ఆట పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం సాంస్కృతిక సారధిలో ఉద్యోగవకాశాన్ని కల్పించినా.. కొన్ని రోజులకు ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. అంతేకాదు.. ప్రభుత్వంపై తన పాటతో పోరాటాన్ని చేశారు. అలాంటి ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు పార్టీలో చేరితే.. ఆంధ్రా మూలాలున్నషర్మిల అనే అడ్డంకిని సులువుగా అధిగమిస్తారన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on March 11, 2021 1:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

11 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

6 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago