Political News

మంత్రుల్లో పెరిగిపోతున్న డిసెంబర్ టెన్షన్

అవును మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే టెన్షన్ చాలామంది మంత్రుల్లో పెరిగిపోతోంది. నిజానికి టెన్షన్ పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో కనిపించాలి. కానీ మంత్రుల్లో కూడా ఎందుకు పెరిగిపోతోంది ? ఎందుకంటే డిసెంబర్ వస్తోంది కాబట్టే. డిసెంబర్ వస్తుంది, వెళుతుంది ఇంతోటిదానికి టెన్షన్ ఎందుకని సందేహపడుతున్నారా ?

సమస్యంతా ఇక్కడే ఉంది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినపుడే రెండున్నరేళ్ళ తర్వాత 90 శాతం మంత్రివర్గాన్ని మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఎక్కువమంది గెలవటంతో వీలైనంతమందిని సంతృప్తి పరచటం కోసమే జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఇపుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గనుక గెలిపించకపోతే డిసెంబర్ ప్రభావం పడితీరుతుందని మంత్రుల్లో ఆందోళన పెరిగిపోతోందట.

డిసెంబర్ రావటానికి ఇంక తొమ్మది మాసాలు మాత్రమే ఉండటంతో పాటు దానికి ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటం చాలామంది మంత్రులకు ఇబ్బందిగా తయారైంది. జగన్ ప్రధాన దృష్టంతా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు లాంటి కార్పొరేషన్ల మీదే ఉంది. వీటిలో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని జగన్ డిసైడ్ చేసిన విశాఖ, ప్రస్తుతం ప్రభుత్వానికి కేంద్రంగా నిలిచిన విజయవాడ కార్పొరేషన్ల గెలుపునే టార్గెట్ చేసుకున్నారట.

జగన్ టార్గెట్ ఏమిటో అర్ధమైపోగానే మంత్రుల్లో టెన్షన్ మొదలైపోయి ఎన్నికల్లో ఉరుకులు పరుగులు పడుతున్నారు. ఉదయాన్నే అభ్యర్ధులతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా ప్రచారంలోకి దిగేస్తున్నారు. పార్టీని గెలిపించాలని మంత్రులు కూడా ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్ టెన్షన్ కారణంగానే మంత్రులు నూరుశాతం శ్రమిస్తున్నారని చెప్పాలి. మరి డిసెంబర్ తర్వాత మంత్రివర్గంలో ఉండేదెవరో పక్కకు పోయేదెవరనే విషయంలో ఆసక్తి పెరిగిపోతోంది.

This post was last modified on March 10, 2021 11:37 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago