ఏ ఎన్నికల్లో అయినా.. పార్టీ నేతలు ఓడిపోతే.. లేదా పార్టీ ఓడిపోతే.. ఎవరు బాధ్యులు..? పార్టీలో ఉన్నవారు బాధ్యులు.. లేదా.. సలహాదారులు.. పరిశీలకులు బాధ్యులు. అంతేతప్ప.. ఉద్యోగులు బాధ్యులా? అంటే.. ఎవరైనా ఏం చెబుతారు? బాధ్యులు కారనే అంటారు. కానీ, జగన్ సర్కారు మాత్రం ఉద్యోగులనే బాధ్యులను చేస్తోంది. ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మద్దతు దారులు గెలవలేక పోయారు. ఇక్కడ టీడీపీ పలు గ్రామాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే.. టీడీపీ గెలవడానికి.. వైసీపీ ఓడిపోవడానికి.. వలంటీర్లే కారణమని ప్రభుత్వ పెద్దలు నిర్ధారించేశారు.
టీడీపీ గెలుపొందిన, వైసీపీ ఓడిపోయిన గ్రామాల్లో వాలంటీర్లను తొలగించారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో టీడీపీ మద్దతు దారులు రెండు గ్రామాల్లో సర్పంచ్ లుగా గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల రెండో విడతలో అద్దంకి నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అద్దంకి మండలంలోని ధేనువకొండ, మోదేపల్లి గ్రామాల్లో టీడీపీ మద్దతు దారులు పంచాయతీ సర్పంచ్ లుగా గెలుపొందారు. దీంతో రెండు గ్రామాల్లో వాలంటీర్లు సరిగా పని చేయలేదని అధికార పార్టీ నేతలు ఆగ్రహించారు.
ధేనువకొండ గ్రామంలో ఏడుగురు, మోదేపల్లి గ్రామంలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ అద్దంకి ఎంపీడీవో రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ధేనువకొండ గ్రామంలో వాలంటీర్ల తొలగింపుపై బాధిత వాలంటీర్లతో కలిసి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ధేనువకొండ గ్రామ సచివాలయం ఎదుట భైఠాయించి తమ నిరసన తెలిపారు. విధుల్లో నుండి తొలగించిన వాలంటీర్లను తిరిగి తీసుకోవాలని నినాదాలు చేశారు. వాలంటీర్లు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా రాజకీయ ఒత్తిడిలతో తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు అద్దంకి నియోజక వర్గంలోని మరికొన్ని పంచాయతీల్లో కూడా వాలంటీర్లను తొలిగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదంగా మారడం గమనార్హం.
This post was last modified on February 27, 2021 10:39 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…