టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి రాజకీయం చాలా స్పీడుగా మారిపోతోంది. టెక్కలి వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ ను జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో దువ్వాడపై అచ్చెన్న కొద్ది మెజారిటితో విజయం సాధించారు. దువ్వాడ ఓడిపోయినా వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో దువ్వాడ జోరుమీదే ఉన్నారు. అయితే ఇవతల అచ్చెన్న కూడా దూకుడు మీదుండే మానిషే కావటంతో ఇద్దరి మధ్య రాజకీయం నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటోంది.
ఎంతగా పార్టీ అధికారంలో ఉన్నా చట్టసభలోకి ప్రవేశించే అవకాశం దక్కలేదనే అసంతృప్తి దువ్వాడలో పేరుకుపోయింది. అయినా ఆ అసంతృప్తిని బయటపడనీయకుండానే నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే జగన్ అదేపనిగా పిలిచి మరీ దువ్వాడను శాసనమండలికి పంపుతున్నారు. దాందో దువ్వాడ ఫుల్లుగా ఖుషీ అయిపోయారు.
తాజాగా మారుతున్న పరిణామాలతో దువ్వాడ మరింతగా రెచ్చిపోవటం ఖాయం. నియోజకవర్గం ఇన్చార్జి హోదాలోనే దువ్వాడ రాజకీయాన్ని అచ్చెన్న తట్టుకోలేకపోతున్నారు. అందుకనే తాను కూడా స్పీడు పెంచుతున్న కారణంగానే ఇద్దరి మధ్యా తరచు గొడవలవుతున్నాయి. మరి తొందరలోనే ఎంఎల్సీ హోదాలో దువ్వాడ చేయబోయే రాజకీయాన్ని అచ్చెన్న ఎలా తట్టుకుంటారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
మొత్తంమీద మున్సిపల్, పరిషత్ ఎన్నికల ముందు దువ్వాడకు ఎంఎల్సీగా అవకాశం రావటంతో తొందరలో రెచ్చిపోవటం ఖాయం. ఎందుకంటే తనకు ఎంఎల్సీ పదవిని ఇచ్చిన జగన్ కు బహుమానంగా మున్సిపాలిటి+పరిషత్ స్ధానాలను ఇవ్వాలని డిసైడ్ అయిపోయారట. ఇటువైపు టీడీపీ అధ్యక్షుని హోదాలో అచ్చెన్న, అటువైపు ఎంఎల్సీ హోదాలో దువ్వాడ..ఇంకేమి కావలి. పసందైన రాజకీయానికి తెరలేవబోతోంది. చూద్దాం ఏం జరగబోతోందో.
This post was last modified on February 27, 2021 1:57 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…