ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో లోకల్ ఫీలింగ్ పెద్దగా కలిగించని వాటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మాదిరి స్థానికంగా ఇది అంత బలంగా లేదన్నది వాస్తవం. తమిళనాడుకు చెందిన సన్ టీవీ వాళ్ల ఆధ్వర్యంలో నడిచే ఈ ఫ్రాంఛైజీలో ఆటగాళ్లు కూడా అంతా నాన్ లోకలే.
వేరే ఫ్రాంఛైజీల్లోనూ నాన్ లోకల్ ఆటగాళ్లే ఎక్కువ ఉంటారు కానీ.. ఇక్కడి అభిమానులతో కనెక్ట్ అయ్యేలా లోకల్ ఆటగాళ్లు ఒకరో ఇద్దరో అయినా ఉండాలని సన్‌రైజర్స్ ఆలోచించట్లేదు. ఒక్కరంటే ఒక్కరికి కూడా స్థానిక ఆటగాడికి జట్టులో చోటు కల్పించలేదు. మహ్మద్ సిరాజ్ లాంటి ఒకరిద్దరు కూడా వేరే ఫ్రాంఛైజీలకు ఆడుతున్నారు. ఇదే విషయమై ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక క్రికెటర్లను పట్టించుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను అంత తేలిగ్గా వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.
స్థానిక ఆటగాళ్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ పట్టించుకోనందుకు గాను హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని దానం అన్నారు. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలామంది ఉన్నారని, కానీ వారిలో ఒక్కరికి కూడా లోకల్ ఐపీఎల్ టీంలో చోటు దక్కకపోవడం అన్యాయమని దానం అన్నారు.ఇటీవల జరిగిన వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
ఇప్పటికైనా హైదరాబాద్ క్రికెటర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తన జట్టులోకి తీసుకోవాలని, లేదంటే పేరు మార్చుకోవాలని ఆయన అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ కెప్టెన్‌గా పెట్టుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఐతే వార్నర్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న దానం అభియోగం తప్పు. అతను బాల్ టాంపరింగ్ కుంభకోణంలో భాగమైనందుకు ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌కు కూడా ఒక ఏడాది దూరంగా ఉండి తిరిగి జట్టులోకి వచ్చి అద్భుతంగా సన్‌రైజర్స్‌ను నడిపిస్తున్నాడు.
This post was last modified on February 21, 2021 8:48 am
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…