ఒకపుడు యుద్ధాల్లో సంధి చేసుకోవాలని అనుకున్నపుడు శతృవులు తెల్లజెండాను చూపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత విషయానికి వస్తే కొద్ది రోజులుగా ఉప్పు-నిప్పులాగున్న ప్రభుత్వం యంత్రాంగం, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ మధ్య కూడా సయోధ్య కుదిరినట్లే ఉంది. ఎందుకంటే పంచాయితి ఎన్నికల మొదటి విడతలో యంత్రాంగం బాగా పనిచేసిందని నిమ్మగడ్డ ప్రశంసిచారు.
తొలిదశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ను నిమ్మగడ్డ అభినందించారు. ఇదే చీఫ్ సెకట్రరీకి నిమ్మగడ్డకు మధ్య ఎన్నిసార్లు లేఖల యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ యుద్ధం కూడా చాలా తీవ్రస్ధాయిలోనే జరిగింది. తన ఆదేశాలను పాటించాల్సిందే అని నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయటం ఆ ఆదేశాలు ఇచ్చే అధికారం నిమ్మగడ్డకు లేదని కొన్ని సందర్భాల్లో చీఫ్ సెక్రటరీ రిప్లై ఇవ్వటం అందరికీ తెలిసిందే.
మొత్తం మీద ఉప్పు-నిప్పు లాగున్న చీఫ్ సెక్రటరి, నిమ్మగడ్డ మధ్య ఆహ్లదకరమైన వాతావరణంలో భేటి జరిగింది. ఈ భేటీలో డీజీపీతో పాటు కొందరు అధికారులు పాల్గొన్నారు. మిగిలిన మూడు విడతల పంచాయితి ఎన్నికల నిర్వహణపై చేసిన చేయాల్సిన ఏర్పాట్లపై భేటీలో చర్చించినట్లు సమాచారం. ఏకపక్షంగా నిమ్మగడ్డ ఇచ్చిన కొన్ని ఆదేశాలను అమలు చేయటానికి చీఫ్ సెక్రటరీ నిరాకరించిన విషయం అందరికీ తెలిసిందే.
మొత్తం మీద మార్చి నెల 31వ తేదీన రిటైర్ అవుతున్న నిమ్మగడ్డ కు తత్వం బోధపడినట్లే ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదని అర్ధమైపోయింది. దానికితోడు కోర్టుల్లో కూడా వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బల వల్ల కూడా నిమ్మగడ్డ తన రూటును మార్చుకున్నట్లున్నారు. కారణాలు ఏమైనా సుహ్రుద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకోవటం తప్పేకాదు.
This post was last modified on %s = human-readable time difference 11:02 pm
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…