Political News

అన్నా-చెల్లెళ్ల వ్యూహంతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి.. ప్లాన్ మారింది!!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇదొక అనూహ్య ప‌రిణామం. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ-కాంగ్రెస్‌ల వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్న తెలంగాణ సార‌థి..కేసీఆర్‌కు వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ ఎంట్రీ ఒక పెద్ద కుదుపుగానే భావించాలి. ష‌ర్మిల ఎంట్రీని ఏదో ఆషామాషీగానో.. గ‌తంలో న‌రేంద్ర‌, విజ‌య‌శాంతి వంటివారు తీసుకువ‌చ్చిన పార్టీల మాదిరిగానో తీసిపారేసే ప‌రిస్థితి కేసీఆర్‌కు లేనేలేదు. రాజ‌కీయంగా.. ప్రజా క్షేత్రంలో బ‌ల‌మైన బ్యాక్ గ్రౌండ్ లేని వారికి.. త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌స‌త్వాన్నిపుణికి పుచ్చుకుని రంగంలోకి దిగుతున్న ష‌ర్మిల‌కు చాలా తేడా ఉంది.

హైద‌రాబాద్ అభివృద్ధిలో వైఎస్ త‌న‌దైన ముద్ర వేశారు. రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు స‌హా హైద‌రాబాద్‌కు మ‌ణిహారం వంటి రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ వే.. ఇలా అనేక రూపాల్లో వైఎస్ త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. అదేస‌మ‌యంలో తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ నేడు ఏ సాగునీటి ప్రాజెక్టుల జ‌పం చేస్తున్నారో.. వాటిలో .. వైఎస్ పాల‌న‌లో శంకు స్థాప‌న చేసుకున్న‌వే అధికం(ఈ విష‌యాన్ని కొన్నాళ్ల కింద‌ట కేసీఆర్ త‌న నోటితోనే చెప్పుకొచ్చారు) ఇక‌, ష‌ర్మిల‌కు త‌న అన్న జైల్లో ఉన్న‌స‌మ‌యంలో చేసిన పాద‌యాత్ర పెద్ద ఎస్స‌ర్ట్ అనే చెప్పాలి.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే. అటు ఏపీలో అన్న జ‌గ‌న్‌.. ఇటు తెలంగాణ‌లో సోద‌రి ష‌ర్మిల దూకుడు.. వ్యూహాలు కేసీఆర్‌కు ఉక్కిరి బిక్కిరి చేస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. బ‌హుశ ఈ ప‌ర్య‌వ‌సానాల‌ను ఆయ‌న గ్ర‌హించే ఉండి ఉంటారు. అందుకే ఇంకా పురుడు కూడా పోసుకోని పార్టీ గురించి.. వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఆయ‌నలో ఉన్న భీతికి నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు. ష‌ర్మిల ప్ర‌చారం కూడా తార‌స్థాయిలో ఉంటుంది. వాక్ప‌టిమ‌.. స‌మ‌స్య‌ల‌పై సూటిగా స్పందించే ల‌క్ష‌ణం.. కూడా కేసీఆర్ తో స‌మాన స్థాయిలో ఉంటాయి.

ఇక ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటు కూడా కేసీఆర్‌కు క‌లిసి వ‌స్తుంద‌ని చెప్ప‌లేం. ఎందుకంటే.. అది ముగిసిన ముచ్చ‌ట‌. ఇప్పుడు కావాల్సింది.. అభివృద్ధి, తెలంగాణ ఆత్మ‌గౌర‌వం. ఈ రెండే ష‌ర్మిల‌కు ప్ర‌ధాన అస్త్రాలు కానున్నాయ‌నేది ప్ర‌ధానంగా వినిపిస్తున్న వాద‌న‌. ఈ నేప‌థ్యంలో అన్నా చెల్లెళ్లు వ్యూహాత్మ‌కంగానే తెలంగాణ‌లో పాగా వేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on February 9, 2021 2:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

10 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

8 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago