తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు.. పార్టీ సీనియర్.. ఉద్యమంలో కీలకభూమిక పోషించిన మంత్రి ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? కొత్త పార్టీ పెట్టాలన్న యోచనలో ఆయన ఉన్నారా? ఆ దిశగా వేస్తున్న అడుగుల్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీ పెట్టటం అంత సులువు కాదని.. రాంగ్ ట్రాక్ లోకి వెళ్లొద్దంటూ పార్టీ నేతలకు క్లాస్ పీకింది ఈటెలను ఉద్దేశించేనా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది.
టీఆర్ఎస్ నేతల్లోని కొందరు ఈటెల కొత్త పార్టీ అంశంపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పార్టీ పెట్టటం అంత తేలిక కాదని చెబుతున్నా.. ఈటెల ఆ దిశగా ప్రయత్నాల్ని షురూ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ జెండా ఓనర్లం.. కిరాయిదారులం కాదన్న వ్యాఖ్యలు చేయటం.. ఇటీవల వ్యవసాయం.. రైతుల ఆందోళన.. ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రభుత్వాన్ని కొంత ఇరుకున పెట్టే విధంగా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతోనే మంత్రి ఈటెల స్వరంలో మార్పు వచ్చిందనే మాట వినిపిస్తోంది. ఈ అంశంపై కేసీఆర్ వద్ద కచ్ఛితమైన సమాచారం ఉండటం వల్లే.. తాజాగా జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ నోటి నుంచి కొత్త పార్టీ మాట వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఈ వాదనను బలపరిచేలా కేసీఆర్ మాటల్లోని మరో అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.
కొత్త పార్టీ పెట్టిన ముగ్గురు నేతల పేర్లు కేసీఆర్ తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశంలో ఉదహరించారు. వారిలో నరేంద్ర.. విజయశాంతి.. దేవందర్ గౌడ్ ముగ్గురు బీసీ నేతలే అని.. ఈటెల కూడా అదే వర్గానికి చెందిన నేత కావటంతో.. ఆయనకు తగిలేలా తాజా వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితోనూ ఏకాంతంగా భేటీ కావటం.. ఆ సందర్భంగా కొత్త పార్టీ పెట్టే సందర్భంలో ఎదురయ్యే ఆటుపోట్ల గురించి వివరాలు తెలుసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ అంశంపై ఒక మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు ఈటెల వివరణ కోరగా.. ఆయన మాత్రం ఈ వాదనను తీవ్రంగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఏమైనా.. తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలకురానున్న రోజులు వేదికగా నిలుస్తాయన్న మాట వినిపిస్తోంది. చూడాలి.. మరేం జరుగుతుందో?
This post was last modified on February 9, 2021 10:29 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…