తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. వైఎస్ జగన్ సోదరి.. వైఎస్ షర్మిలకు గట్టి వార్నింగ్ ఇచ్చారా? పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టు షర్మిల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారా? లేక.. రేపు షర్మిల కొత్త పార్టీ కనుక పెడితే.. తన పార్టీకి గట్టి పోటీ ఇస్తుందనే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కొన్నాళ్ల కిందట.. షర్మిల పార్టీ పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. దీనిని ఆమె.. తిరస్కరించలేదు.. సమర్ధించనూలేదు.
ఈ నేపథ్యంలో అంతో ఇంతో ఈ విషయంలో నిజం ఉందనే వాదన బయటకు వచ్చింది. మరీముఖ్యంగా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి బలమైన నాయకత్వం కావాలనేది వాస్తవమే. అధికార టీఆర్ ఎస్ రెడ్డి సామాజిక వర్గాన్ని చేరువ చేసుకున్నా.. వారిలో భరోసా నింపలేక పోయింది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండంగా ఉండడంతో ఆ పార్టీలో ఉన్న రెడ్లు కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేప థ్యంలో రెడ్డి సామాజిక వర్గం ఒక పొలిటికల్ డయాస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పార్టీ కనుక పెడితే.. ఇటు టీఆర్ఎస్‌కు, అటు కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అనేది విశ్లేషకుల మాట.
బహుశ ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్.. తాజాగా షర్మిల పార్టీని ఉద్దేశించి పేరు చెప్పకుం డా పరోక్షంగా కొన్ని కీలక కామెంట్లు చేశారు. “కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీనా ? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు. ఎటూకాకుండా తెరమరుగై పోతారు” అని వ్యాఖ్యానించారు. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీ ఆర్ఎస్ ఒక్కటే అని కేసీఆర్ అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్థం.. పరోక్షంగా ఆయన షర్మిలను హెచ్చరిస్తున్నారనే అంటున్నారు పరిశీలకులు. అయితే.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్, టీఆర్ ఎస్‌లు మారకపోవడంతో రెడ్డి సామాజిక వర్గం ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని మాత్రం కేసీఆర్ ప్రస్థావించకపోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2021 3:59 pm
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…