వైసీపీ అధినేత జగన్‌కు భారీ షాక్ తగిలింది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కీలక పథకాలను ఆయన అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం.. ఇంటింటికీ రేషన్ పంపిణీ
. వైసీపీ నేతలు, సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే.. ఈ పథకం దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు. నిజమే! ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటింటికీ.. రేషన్‌ను పంపిణీ చేయలేదు. బహుశ ఇది సాధ్యం కాదని.. ఆయా రాష్ట్రాలు ఎప్పుడో గుర్తించి ఉంటాయి. కానీ, ఏపీలో మాత్రం జగన్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
సుమారు 9270 వాహనాలను కొనుగోలు చేసి.. యువతకు అప్పగించారు. నెలకు 1800 మంది లబ్ధి దారులకు 1వ తారీకు నుంచి 15వ తారీకులోపు రేషన్ సరుకులను ఇంటి ముందుకే తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ఇది పైకి చెప్పడానికి, ప్రచారం చేసుకునేందుకు చాలా బాగానే ఉంది. ముఖ్యంగా ఈపథకం నుంచి జగన్ చాలా నే ఆశించారు. ఓటు బ్యాంకు విషయంలో సానుభూతి తనకు పెరుగుతుందని భావించారు. ఈ క్రమంలోనే అప్పు చేసి మరీ వాహనాలు కొన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల 1 నుంచే ప్రారంభించాలని అనుకున్నారు. అయితే.. పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వాహనాలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్రేకులు వేశారు.
ఈ నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో రెండు రోజలు కిందట ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు మంత్రి కొడాలి నాని. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఈయనకు కూడా ఈ పథకాన్ని సక్సెస్ చేసుకోవడం అత్యంత కీలకం. అయితే.. క్షేత్రస్థాయిలో రెండు రోజుల్లోనే పరిస్థితి యూటర్న్ తీసుకుంది. కీలకమైన.. ఐదు విధులను ఒక్కరే చేసేందుకు డ్రైవర్లు అంగీకరించడం లేదు. నేను ఒక్కడినే అన్నీ చూసుకోవాలి. డ్రైవింగ్ నేనే చేసుకోవాలి. బియ్యం బస్తాలను స్టాక్ పాయింట్ నుంచి నేనే మోసి.. బండిలో వేసుకోవాలి. వాటిని ఇంటింటికీ చేర్చాలి. రెండో అంతస్థులోనో మూడో అంతస్థులోనో(ఇందిరమ్మ గృహాలు) లబ్ధి దారులు ఉంటే.. అక్కడ కి చేర్చాలి. ఇక, ఈ పోస్ మిషన్ ఆపరేట్ చేసుకోవాలి. డబ్బులు లెక్కపెట్టుకోవాలి. ఇన్నీ చేసుకుంటే నాకు కిట్టుబాటు అయ్యేది 400 ఈ మాత్రానికి నేను ఇంత చాకిరీ చేయాలా?!
-ఇదీ పథకం ప్రారంభించిన రెండు రోజుల తర్వాత.. డ్రైవర్ల నుంచి వ్యక్తమైన అబిప్రాయం. దీంతో వెయ్యికి పైగా వాహనాలను డ్రైవర్లు.. ఆర్ ఐ(రీజినల్ ఇన్స్‌పెక్టర్)కు అప్పగించేసినట్టు తెలిసింది. మరి ఈ కీలక పథకం ఆదిలోనే ఇలా రెక్కలు విరిగిపోతే.. మున్ముందు పరిస్థితి ఏంటి? ఏదేమైనా.. ఈ పరిణామం.. జగన్‌కు షాకిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 5, 2021 3:41 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…