పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ కు బ్రేకులు పడ్డాయి. ఏ యాప్ విడుదల చేయాలన్నా, గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి తేవాలంటే కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పాటించాలి. ఇటువంటి ప్రమాణాల్లో సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ అన్నది చాలా ప్రధానమైనది.
అయితే ఎటువంటి ప్రమాణాలు పాటించకుండానే, సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ లేకుండానే నిమ్మగడ్డ యాప్ ను విడుదల చేసేశారు. మొదటి నుండి యాప్ వాడకంపై రాష్ట్రప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కమీషనర్ లెక్కచేయలేదు. తాను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తన నిర్ణయాలపై ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పేందుకు లేదంటూ ఒంటెత్తు పోకడలు పోతున్నారు. అందుకే యాప్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది.
సరే ఈ విషయాలు ఎలాగున్నా యాప్ ను నిమ్మగడ్డ బుధవారం విడుదల చేశారు. గురువారం నుండి జనాలకు గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందన్నారు. అయితే యాప్ ను తాను విడుదల చేసినా సాంకేతిక లోపాల కారణంగా గుగుల్ ప్లే స్టోర్ లో పనిచేయటం లేదట. కారణం ఏమిటా అని చూస్తే యాప్ కు సెక్యురిటి ఆడిట్ సర్టిఫికేట్ లేకపోవటమే అని తేలింది.
ఇపుడు సెక్యురిటీ ఆడిట్ సర్టిఫికేట్ కోసమని యాప్ ను ఏపి టెక్నాలజీ సర్వీసెస్ కు నిమ్మగడ్డ పంపారు. ఈ యాప్ తయారీలో తీసుకున్న ప్రమాణాలు, వాడకంలో తలెత్తే సమస్యలు, వాటిని అధిమించే అవకాశాలు లాంటి వాటిని ఏపి టెక్నాలజీ సర్వీసెస్ పరిశీలించి అప్పుడు ఆడిట్ సెక్యురిటి సర్టిఫికేట్ జారీచేస్తుంది. అప్పుడు గుగుల్ ప్లే స్టోర్ లో జనాలకు అందుబాటులోకి వస్తుంది. ఇదంతా జరగటానికి కొంతకాలం పట్టే అవకాశం ఉంది. మరి పంచాయితి ఎన్నికల్లోగా ఈ వాచ్ యాప్ అందుబాటులోకి వస్తుందో లేదో.
This post was last modified on February 5, 2021 11:25 am
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…