రెండు ప్రభుత్వాల్లోను గొట్టిపాటి రవికుమార్ టార్గెట్ గా మారటం విచిత్రంగా ఉంది. ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఎంఎల్ఏగా గొట్టిపాటి కంటిన్యు అవుతున్నారు. గొట్టిపాటి అంటేనే అందరికీ మైనింగ్ వ్యాపారాలే గుర్తుకొస్తాయి. జిల్లాలోని ప్రముఖ గ్రానైట్ వ్యాపార సంస్ధల్లో గొట్టిపాటి వాళ్ళది కూడా ఒకటి. అలాంటిది ప్రభుత్వం ఒత్తిళ్ళ కారణంగా వ్యాపారాలన్నీ దాదాపు మూతపడిపోయాయి. ముందు ఫ్యాక్టరీలపై దాడులు. తర్వాత ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు. ఇపుడు క్రష్షర్లపైన కూడా దాడులు. దాంతో ఇక లాభం లేదనుకుని తనకున్న అన్నీ యూనిట్లను మూసేయాలని రవికుమార్ డిసైడ్ అయ్యారు.
యూనిట్లు మూసేయక గొట్టిపాటి చేసేది కూడా ఏమీలేదు. ఎందుకంటే గనుల లీజులను రద్దు చేసేసింది ప్రభుత్వం. ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతులను రద్దు చేసింది. గ్రానైట్ ను అమ్మటం, కొనటంపై బ్యాన్ పెట్టింది. ఇక ఏమి మిగిలిందని గొట్టిపాటి బిజినెస్ చేయాలి ? అందుకనే అన్నీ యూనిట్లను మూసేయాలని డిసైడ్ అయ్యారు. అసలీ పరిస్ధితి ఎందుకొచ్చింది ? ఎందుకంటే నూరుశాతం రాజకీయ కారణాలే అని చెప్పక తప్పదు.
విచిత్రమేమిటంటే రెండు ప్రభుత్వాల్లోను గొట్టిపాటి టార్గెట్ గా మారటం. గొట్టిపాటికి అసలు సమస్య టీడీపీ హయాంలోనే మొదలైంది. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన గొట్టిపాటిని వైసీపీ నుండి తెలుగుదేశంపార్టీలోకి మారాల్సిందిగా ఒత్తిడి మొదలైంది. దానికి ఎంఎల్ఏ నిరాకరించటంతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం రకరకాలుగా వేధించింది. వాళ్ళ వేధింపులను తట్టుకోలేక చివరకు 2016లో వైసీపీలో నుండి టీడీపీలోకి ఫిరాయించారు.
టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత గొట్టిపాటి ఫ్యాక్టరీలపై అప్పటి ప్రభుత్వం వేధింపులు ఆగిపోయాయి. సరే 2019 ఎన్నికల్లో మళ్ళీ అద్దంకిలో గొట్టిపాటే గెలిచారు. అయితే టీడీపీ ఘోరంగా ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలం తర్వాత నుండి ఎంఎల్ఏ ఫ్యాక్టరీలపై దాడులు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే గొట్టిపాటి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.
అయితే ప్రచారం ప్రచారంగానే ఉండిపోయింది. ఇదే సమయంలో వ్యాపారాలపై దాడులు మొదలయ్యాయి. మొత్తం మీద అప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే కాకుండా ఇపుడు వైసీపీ ప్రభుత్వంలో కూడా గొట్టిపాటి టార్గెట్ గా మారటమే విచిత్రంగా ఉంది. దశాబ్దాల గ్రానైట్ వ్యాపారాలను మూతేయటమంటే ఎవరికైనా బాధాకరమే. వ్యాపారాల్లో సమస్యలు వచ్చి మూసేయటం వేరు రాజకీయ కారణాలతో వ్యాపారాలను మూసేయటం వేరు. మొత్తానికి గొట్టిపాటి వ్యాపారాలను దాదాపు మూసేసినట్లే.
This post was last modified on February 3, 2021 12:16 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…