టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సొంత నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని నిమ్మాడలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య గత నాలుగు రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఇక్కడి పంచాయతీని టీడీపీ ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్ని స్తోంది. ఈ క్రమంలో అచ్చెన్న సతీమణినే నేరుగా ఇక్కడ సర్పంచ్ పదవికి పోటీ పెట్టారు. వాస్తవానికి వైసీపీ తరఫున ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. కానీ, వైసీపీ టెక్కలి ఇంచార్జ్.. దువ్వాడ శ్రీను వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుడైన దూరపు బంధువు కింజరాపు అప్పన్నను సర్పంచ్ పదవికి రంగంలో కి దింపారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వివాదం చెలరేగింది. అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీను ఎంట్రీ అయి.. అప్పన్నతో నామినేషన్ వేయించారు. ఇక, ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య మాటల యుద్దంతో పాటు ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు.. తన బంధువే అయిన అప్పన్నకు ఫోన్ చేసి.. నామినేషన్ ఉపసంహరిం చుకోవాలని.. ఒకింత బెదిరింపు ధోరణితో హెచ్చరించిన ఆడియో ఒకటి వెలుగు చూసింది.
ఇప్పటికే నామినేషన్ వేసే క్రమంలో చోటు చేసుకున్న వివాదంపై అచ్చెన్న వర్గంపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఆడియో టేపు ఆధారంగా వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేశారనే నేరంపై ఆయనను అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అచ్చెన్న పోలీసుల తీరుపై మండి పడ్డారు. ‘‘డీఎస్పీ, సీఐలు నా బెడ్రూమ్ లోకి చొరబడ్డారు… ఖాకీ డ్రస్ అంటేనే విరక్తి కలుగుతోంది. పోలీసులను చూసి ఉద్యోగులు కూడా సిగ్గు పడుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా… రేపు అధికారం మాదే. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే నేనే హోంమంత్రిని. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు. తాట తీస్తా!!’’ అని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
This post was last modified on February 2, 2021 9:05 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…