దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైతుసంఘాల ఉద్యమానికి ఎంత మద్దతు వస్తోందో అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోయిన సంవత్సరం ఆగష్టులో మొదలైన ఆందోళన ఇటు పంజాబు అటు హర్యానాకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే ఆందోళన ఢిల్లీ బాట పట్టిందో అప్పటి నుండి ఉద్యమంగా రూపుదాల్చింది.
రైతుల ఆందోళనను ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో కేంద్రప్రభుత్వం ఆపేసింది. దాంతో అప్పటివరకు జరుగుతున్న ఆందోళన కాస్త ఉద్యమంగా మారిపోయింది. ఉద్యమానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రైతాంగం నుండి ఊహించని మద్దతు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం రైతుసంఘాల ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న ఐటిసెల్ అనే చెప్పాలి. రైతుసంఘాల ఉద్యమానికి జాతీయ మీడియా పెద్దగా కవరేజి ఇవ్వటం లేదని రైతుసంఘాల నేతలకు అర్ధమైపోయిందట.
ఉద్యమానికి ప్రచారం ఇవ్వకపోగా రివర్సులో ఉద్యమాన్ని నీరుగార్చేట్లుగా ఉందట జాతీయ మీడియా వ్యవహారం. దాంతో అప్పటికప్పుడు రైతులు, రైతుకుటుంబాల్లోని యువ విద్యావంతుల ఆధ్వర్యంలో ఐటిసెల్ ఏర్పాటు చేసుకున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాను అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నారు. దాంతో మెయిన్ మీడియాపై ఆధారపడకుండా తమ వాదనను రైతుసంఘాలు సోషల్ మీడియా ద్వారా సొంతంగానే జనాల్లోకి పంపటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రైతుసంఘాల కార్యక్రమాల కోసం సోషల్ మీడియా ఏర్పాటయ్యిందో వెంటనే ఆదరణ కూడా మొదలైపోయింది.
ప్రస్తుతం ట్విట్టర్లో 1.44 లక్షలు, ఫేస్ బుక్ లో 2.86 లక్షలు, ఇన్ స్టాగ్రామ్ లో సుమారు 2 లక్షలు, యూట్యూబ్ లో దాదాపు 12.5 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ప్రతిరోజు సుమారు 2.5 కోట్లమంది రైతుఉద్యమానికి సంబంధించిన విషయాలను జనాలు తెలుసుకుంటున్నారు. పంజాబు, హర్యానాలోని రైతుల కుటుంబాలకు చెందిన విదేశాల్లో ఉన్న వారే సోషల్ మీడియా సాంకేతిక పరిజ్ఞానంలో కీలకపాత్ర పోషిస్తున్నారట. కేంద్రప్రభుత్వంతో జరిగిన చర్చలను, రైతుసంఘాల నేతల వాదనలను ఎప్పటికప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళటంలో సోషల్ మీడియానే ప్రధానపాత్ర పోషిస్తోంది.
ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళటంలో రైతుసంఘాలు జాతీయ మీడియాపైన ఏమాత్రం ఆధారపడటం లేదు. రైతుసంఘాల ఐటి విభాగం ఇన్చార్జి బల్జీత్ సింగ్ మాట్లాడుతూ ఉద్యమప్రచారంపై జాతీయమీడియా పైన ఆధారపడితే లాభం లేదని అర్ధమైపోయిందన్నారు. తమ వాదనను తాము నేరుగా జనాలకు వినిపించేందుకే సొంతంగా సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. జాతీయ మీడియాలో మెజారిటి కేంద్రప్రభుత్వం గుప్పిట్లో ఇరుక్కుపోయినట్లు బల్జీత్ ఆరోపించారు. మొత్తానికి సొంతంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియాతో రైతుసంఘాలు జనాల్లోకి దూసుకుపోతున్నారు.
This post was last modified on %s = human-readable time difference 5:00 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…