దాదాపు రెండు నెలలపాటు ప్రశాంతంగా ఉద్యమం చేసి యావత్ దేశంతో శెభాష్ అనిపించుకున్న రైతుఉద్యమం మంగళవారం జరిగిన ఘటనలతో బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢీల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో రైతులు రెండు నెలలుగా భారీ ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
రైతుసంఘాలు ఎంతగా ఉద్యమం చేస్తున్న కేంద్రం పట్టించుకోలేదు. ఈ పరిస్దితుల్లో సుప్రింకోర్టు కలగజేసుకుని సమస్యను సర్దుబాటు చేద్దామని ప్రయత్నంచేసింది. ముందుగా చట్టాల అమలుపై సుప్రింకోర్టు స్టే విధించింది. తర్వాత జరిగిన పరిణామాలతో చట్టాల అమలును ఏడాదిన్నర పాటు వాయిదా వేస్తామని కేంద్రం ప్రతిపాదించింది. అయితే చట్టాల అమలును వాయిదా వేయటం కాదని రద్దు చేయాల్సిందే అని రైతుసంఘాలు పట్టుబట్టాయి.
ఒకవైపు చర్చలు జరుగుతుండగానే జనవరి 26వ తేదీన భారీ ర్యాలీని నిర్వహించబోతున్నట్లు రైతులు ప్రకటించారు. అనేక చర్యల తర్వాత చివరకు ఢిల్లీ పోలీసులు అంగీకరించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం మొదలైన ర్యాలీ అనేక హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. వేలమంది పోలీసులకు, రైతులకు మధ్య అనేక ప్రాంతాల్లో పెద్దస్ధాయిలో ఘర్షణలు జరిగాయి. రైతులదే తప్పని పోలీసులు, కాదు కాదు పోలీసులదే తప్పని రైతుసంఘాలు ఇపుడు వాదులాడుకుంటున్నాయి.
ఏదేమైనా రైతులు ఎర్రకోటపైకి ఎక్కటం. అక్కడ రైతుసంఘాల జెండాను ఎగరేయటం, ఢిల్లీ వీధుల్లో పోలీసులపైకే ట్రాక్టర్లను నడిపి భయపెట్టడం లాంటి ఓవర్ యాక్షన్లతో ఢిల్లీ వీధులు గంటల కొద్దీ అట్టుడుకిపోయాయి. చివరకు టెలికాం లైన్లను, ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ ను కేంద్రప్రభుత్వం కట్ చేయాల్సొచ్చిందంటే పరిస్ధితి ఎంత చేయిదాటిపోయిందో అర్ధమవుతోంది.
ఈ మొత్తం ఘటనల్లో పోలీసులదే తప్పుందని అనుకున్నా ఎర్రకోటపైకి రైతులు దాడి చేయటం, రైతుసంఘాల జెండాను ఎగరేయటం ముమ్మాటికి తప్పే. రెండు నెలలుగా ప్రశాంతంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని దేశం యావత్తు మద్దతుగా నిలిచింది. కానీ చివరిరోజున ఢిల్లీ రోడ్లలో రైతులే అలజడి సృష్టించటంతో బాగా చెడ్డపేరు వచ్చేసింది. విధ్వంసం విద్రోహుల చర్యే అని సింపుల్ గా ఓ ప్రకటన ఇచ్చేస్తే సరిపోదు. ఎందుకంటే వచ్చిన చెడ్డపేరు ఎప్పటికీ పోదు.
This post was last modified on January 27, 2021 10:47 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…