Political News

జ‌న‌సేన పేరుతో రూ.7 కోట్ల మోసం..

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పేరు ఉపయోగించుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ మోసం కోసం జనసేన నాయకులు కళ్యాణం శివ శ్రీనివాసరావు, వీర మహిళ నాయకురాలు కోట రుక్మిణి పేర్లను ఉపయోగించారు. అంతేకాకుండా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సంబంధించిన లోగో, గుర్తులు, అధికారిక లెటర్‌హెడ్‌లను కూడా నకిలీగా వాడుకున్నారు.

గగర ధరణి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ కన్సల్టెన్సీ జాబ్ ఏజెన్సీలో పనిచేసిన ధరణి, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాయకుల పేర్లతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను నమ్మించినట్లు తెలుస్తోంది.

కళ్యాణం శివ శ్రీనివాసరావు ప్రస్తుతం జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఈ వ్యవహారం పార్టీ కార్యాలయం దృష్టికి రావడంతో ఆయన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

This post was last modified on November 13, 2026 9:25 pm

Share

Recent Posts

చంద్రబాబు-సముద్రం… ఏపీకి ఇంకేం కావాలి..

"ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు విజన్ ఉంది. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఉంది.…

2 minutes ago

Pics: రాషా లుక్ అదుర్స్!

శ్రీనివాస మంగాపురంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాషా తడాని. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తెగా సినీ ప్రేక్షకులకు…

9 minutes ago

కుటుంబం స్టామినాని సరిగా వాడుకోలేదు

ఆదర్శ కుటుంబం ఏకె 47 ఏదో అనుకుంటే ఏదో చేసింది. నిజమే. కానీ మొదటి మూడు రోజులు హడావిడి చేసి…

18 minutes ago

ప్రపంచ కాలుష్య నగరాల్లో టాప్ మనదే

అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పడానికి ఢిల్లీ వాయు కాలుష్యమే మరో నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య…

33 minutes ago

ఇప్పుడు దేశానికి మోదీఏ కరెక్ట్

వ‌చ్చే 2029 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కూట‌మిగానే ముందుకు వెళ్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. గ‌తంలో 2014లో కూడా కూట‌మిగానే…

2 hours ago

అటెన్షన్ మొత్తం మెగావర్స్ తీసుకుంటే

మెగా అభిమానులకు కొత్త టెన్షన్ మొదలయ్యింది. ఒకపక్క కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతూ జనవరి 13 విడుదలని పదే పదే…

2 hours ago