Movie News

కుటుంబం స్టామినాని సరిగా వాడుకోలేదు

ఆదర్శ కుటుంబం ఏకె 47 ఏదో అనుకుంటే ఏదో చేసింది. నిజమే. కానీ మొదటి మూడు రోజులు హడావిడి చేసి ఆ తర్వాత హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం ప్రమోషన్ల పరంగా ఈ సినిమాకు పడిన పెద్ద దెబ్బని చెప్పక తప్పదు. ఎందుకంటే రెండో వారంలో కూడా చాలా చోట్ల ఈ మూవీకి డీసెంట్ ఆక్యుపెన్సీలున్నాయి. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో కాబట్టి ఒక్కసారైనా చూద్దామనుకున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. కానీ వాటిని పెంచే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ట్రాజెడీ.

ఎలా చూసినా ఆదర్శ కుటుంబం దారుణమైన ఫ్లాప్ అయితే కాదు. యావరేజ్ కి ఒక మెట్టు కింద ఆగిపోయింది. మరీ దారుణంగా ఎవరూ తిట్టలేదు. కానీ త్రివిక్రమ్ మీద అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి క్వాలిటీ తక్కువ ప్రోడక్ట్ ని ఆశించలేదు. ఒకవేళ అప్ కమింగ్ డైరెక్టర్ పేరుతో కనక ఇది వచ్చి ఉంటే కొంచెం మెరుగైన రెస్పాన్స్ ఉండేదన్న కామెంట్ ని కొట్టి పారేయలేం. సరే అయిందేదో అయ్యింది కనీసం ఒక పది రోజుల పాటు ప్రమోషన్లను కొనసాగించాల్సిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఇదంతా అయ్యాకే త్రివిక్రమ్ శ్రీనివాస్, రాధాకృష్ణ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయంటూ ఫిలిం నగర్ వర్గాల్లో ఏవేవో ప్రచారాలు జరిగాయి. వాటికి చెక్ పెట్టడం కోసమే అన్నట్టు ఈ ఇద్దరు తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో దిగిన ఫోటో ఒకటి షేర్ చేశారు నాగవంశీ. అంటే ఎలాంటి తేడాలు లేవు, అంతా సవ్యంగా ఉందని చెప్పడానికి కాబోలు. ఈ లెక్కన డివివి బ్యానర్ లో చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ చేయబోయే సినిమా తాలూకు న్యూస్ నిజం కాకపోవచ్చని చెప్పొచ్చు.

ఏది ఏమైనా ఆదర్శ కుటుంబం స్టామినాని సరిగా వాడుకోలేదని ఒప్పుకోవాలి. అర్జున్ బ్లాస్ట్ జోన్ పోలికల గురించి ఎంత డిస్కషన్ జరిగినా కంటెంట్ ప్రాపర్ ఉండి ఉంటే ఆడియన్స్ అసలా కంపారిజన్ చేసేవాళ్ళు కాదు. కానీ అలా జరగలేదు. సరే గతాన్ని తవ్వి లాభం లేదు  కానీ త్రివిక్రమ్ తర్వాత చేయబోయే గాడ్ అఫ్ వార్ (ప్రచారంలో ఉన్న టైటిల్) మటుకు యునానిమస్ గా బెస్ట్ అనిపించుకోవాలి. షూటింగ్ మొదలుకాలేదు. ఎప్పుడు స్టార్ట్ అయినా 2028 లేదా ఆపై ఏడాది కన్నా ముందు రిలీజ్ ఉండదు. 

This post was last modified on November 13, 2026 5:06 pm

Share

Recent Posts

చంద్రబాబు-సముద్రం… ఏపీకి ఇంకేం కావాలి..

"ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు విజన్ ఉంది. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఉంది.…

6 seconds ago

Pics: రాషా లుక్ అదుర్స్!

శ్రీనివాస మంగాపురంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాషా తడాని. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తెగా సినీ ప్రేక్షకులకు…

7 minutes ago

జ‌న‌సేన పేరుతో రూ.7 కోట్ల మోసం..

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పేరు ఉపయోగించుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రభుత్వ…

18 minutes ago

ప్రపంచ కాలుష్య నగరాల్లో టాప్ మనదే

అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పడానికి ఢిల్లీ వాయు కాలుష్యమే మరో నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య…

31 minutes ago

ఇప్పుడు దేశానికి మోదీఏ కరెక్ట్

వ‌చ్చే 2029 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కూట‌మిగానే ముందుకు వెళ్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. గ‌తంలో 2014లో కూడా కూట‌మిగానే…

2 hours ago

అటెన్షన్ మొత్తం మెగావర్స్ తీసుకుంటే

మెగా అభిమానులకు కొత్త టెన్షన్ మొదలయ్యింది. ఒకపక్క కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతూ జనవరి 13 విడుదలని పదే పదే…

2 hours ago