కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తున్న బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ ఆధారంగా తెలుగులో సినిమా నిర్మించనున్నట్లు తెలంగాణా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ వార్త ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే సోనియా గాంధీ ఆత్మ కథ పై విపరీతమైన చర్చ జరుగుతుంది. యూపీఏ హయాంలో జరిగిన కీలక ఘటనల వెనక అసలేం జరిగిందన్న విషయాలు కొన్ని బహిర్గతం కావడంతో వివాదమైంది. అధికార బీజేపీ అయితే సోనియా చరిత్ర మీద విమర్శలను సంధిస్తుంది. ఈ క్రమంలో సోనియా గాంధీ కథతో సినిమా నిర్మించే విషయంపై జగ్గారెడ్డి ప్రకటన చేయడం ఆసక్తి కలిగిస్తుంది.
విదేశీ మహిళగా అనేక విమర్శలు ఎదుర్కొన్న సోనియా గాంధీ జీవితం ఆద్యంతం ఎన్నో ఎమోషన్స్, సెంటిమెంట్స్ తో కూడుకుంది. ఒక ప్రధాన మంత్రికి కోడలిగా, మరొక ప్రధాన మంత్రికి భార్యగా వ్యవహరించినప్పటికి ఆమె జీవితం ఆహ్లాదంగా సాగలేదు. ఒక సూపర్ హిట్ సినిమాకు కావాల్సినంత మలుపులు వున్నాయి.
దేశం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన సోనియా గాంధీ జీవితాన్ని ప్రజలంతా తెలుసుకోవలసిన అవసరం వుందని జగ్గారెడ్డి చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తానని, దీనికి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మాతలుగా వ్యవహారిస్తారని వెల్లడించారు. సినిమా కోసం త్వరలో ఓ కమిటీ వేస్తానని తెలిపారు.
మన దేశంలో గతంలో అనేక రాజకీయ నాయకుల బయోపీక్ లు వచ్చాయి. దేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనాలు సృష్టించింది. ప్రతిష్టత్మాక ఆస్కార్ అవార్డులు ఎనిమిది గెలుచుకుంది. రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ జీవిత ప్రస్థానం మీద అనేక సినిమాలు వచ్చాయి.
1993లో వచ్చిన సర్దార్ అనే చిత్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ జీవితాన్ని, దేశ విభజన తర్వాత సంస్థానాల విలీనంలో ఆయన పోషించిన పాత్రను చూపించారు. పీఎం నరేంద్ర మోదీ పేరుతో వచ్చిన సినిమా మీద కూడా విపరీతంగా చర్చ జరిగింది. ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్, సుభాష్ చంద్రబోస్ చరిత్రలు కూడా సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని నెగిటివ్ గా తీసిన సినిమాలు కూడా వున్నాయి.
తెలుగులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు జీవిత చరిత్రను సినిమాగా నిర్మించారు. కథా నాయకుడు, మహా నాయకుడు పేరుతో ఎన్టీ రామారావు సినీ, రాజకీయ జీవితాల ఆధారంగా రెండు భాగాలుగా ఈ చిత్రాలు నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన యాత్ర సూపర్ హిట్ అయ్యింది.
తమిళంలో ఎంజీఆర్, కరుణానిధి స్నేహం, రాజకీయ వైరం గురించి మణిరత్నం నిర్మించిన ఇరువర్ క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ వరసలో సోనియా గాంధీ సినిమా వార్త కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహన్ని రేకేత్తిస్తుంది.
This post was last modified on November 12, 2026 12:21 am
ఇరుముడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ పెళ్లి ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. తన…
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గ్రీస్‌లో కుటుంబ…
రెండేళ్ల కిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. హైదరాబాద్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం…
రామాయణం సినిమా రిలీజ్ ముంగిట ఎటు చూసినా నెగెటివ్ వార్తలే కనిపించేవి. రూ.4 వేల కోట్ల బడ్జెట్ సహా ఆ…
ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే రద్దీ, హడావుడి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లలో ఎక్కడం, దిగడం ప్రయాణికులకు…
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…