జ‌గ‌న్‌కు డబుల్ షాక్‌..

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పులివెందుల పూర్తిగా టీడీపీ వ‌శం అయిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో పులివెందుల మునిసిపాలిటీలో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ షాక్ నుంచే వైసీపీ నేత‌లు తేరుకోలేదు. ఇంత‌లోనే పులివెందుల జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లు కూడా జ‌గ‌న్‌కు భారీ షాక్ ఇచ్చాయి. ఇక్క‌డ కూడా టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. తాజాగా జ‌రిగిన ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్య‌ర్థి భార‌తి విజ‌యం సాధించారు.

పులివెందుల జ‌డ్పీ సీటును రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం బీసీల‌కు కేటాయించారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌ఫున బొంగాని భార‌తి యాద‌వ్ బ‌రిలో నిల‌వ‌గా.. వైసీపీ త‌ర‌ఫున సావిత్రి పోటీ చేశారు. ఇరువురు బ‌ల‌మైన ప్ర‌చార‌మే నిర్వ‌హించా రు. స్థానిక ఎన్నిక‌ల మాదిరిగా కాకుండా.. పులివెందుల జ‌డ్పీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగానే ముగిశాయి. అలానే ఓట్లు కూడా బాగానే ప‌డ్డాయి. ఇక్క‌డ స‌గ‌టున 70 శాతం పోలింగ్ జ‌రిగిన‌ట్టు అధికారులు తెలిపారు. ఈ పోరులో వైసీపీ మ‌రోసారి ప‌రాజ‌యం పాల‌య్యారు.

టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థుల మ‌ధ్య 1463 ఓట్ల తేడా వ‌చ్చింది. దీంతో టీడీపీ అభ్య‌ర్థి 1463 ఓట్ల మెజారిటీతోనే విజ‌యం ద‌క్కించుకున్నారు. కాగా.. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి పులివెందుల మునిసిపాలిటీ.. ఇప్పుడు జ‌డ్పీ కూడా ఆ కుటుంబానికి దూర‌మ‌య్యాయి.దీంతో వైసీపీ శిబిరం తెల్ల‌బోయింది. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అయితే.. ఏదో చేశార‌ని.. అందుకే గెలిచార‌ని ఆరోపించినా.. జ‌డ్పీ ఎన్నిక‌ల‌ స‌మ‌యంలో అలాంటివేవీ జ‌ర‌గ‌లేదు. దీంతో విజ‌యం వ‌న్ సైడ్ అన్న‌ట్టుగా టీడీపీ సొంతం చేసుకుంది.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం వ‌చ్చిన పులివెందుల రిజ‌ల్ట్‌పై భిన్న‌మైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ గ్రాఫ్ పూర్తిగా త‌గ్గిపో యింద‌ని ఓ వ‌ర్గం వాదిస్తుండ‌గా.. స్థానిక ఎన్నిక‌ల్లో ఇలానే ఫ‌లితం ఉంటుంద‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది. పైగా.. వైసీపీ అధినేత చుట్టూ.. మేన‌కోడ‌లి వివాహ వేడుక వివాదం కూడా ఇదే ఎన్నిక‌ల స‌మ‌యంలో ముసురుకోవ‌డం కూడా ఫ‌లితాన్ని ఏక‌ప‌క్షం చేసింద‌న్న వాద‌నవినిపించేలా చేసింది. ఏదేమైనా వైసీపీకి కంచుకోట‌లో పార్టీ పిల్లిమొగ్గ‌లు వేయ‌డం గ‌మ‌నార్హం.