Political News

రెండు యాక్సిడెంట్ల నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే

ఒకే రోజు… వెంటవెంటనే రెండు యాక్సిడెంట్లు. లక్కీగా ఆ ఎమ్మెల్యే బయటపడ్డారు. తెలంగాణాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఏమైనా కుట్ర దాగివుందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణా ప్రభుత్వ విప్ వేముల వీరేశం గురువారం చిట్యాల మండలం చినకాపర్తి గ్రామంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు తన ఫార్చ్యూనర్ కారులో బయలుదేరారు. కారు కట్టంగూరు మండలం చెరువు అన్నారం సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే ఊహించనిరీతిలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని కారు వెనక నుంచి ఢీ కొట్టింది. ఆ దెబ్బకు కారు ముందు వెళుతున్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొంది. ఆ కుదుపుకు కారు లోపల వున్న ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు . వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే ఎమ్మెల్యేని మరో ఇన్నోవా వాహనంలోకి మార్చి పంపించారు.

ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడిన ఎమ్మెల్యే వేముల వీరేశం చిట్యాల మండలంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుంగతుర్తి వైపు బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు మరో ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న ఒక లారీ ఎమ్మెల్యే కారును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారుకు ఎడమవైపు భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం నుండి కూడా ఆయన సురక్షితంగా బయటపడ్డారు.

అయితే వెంట వెంటనే జరిగిన ప్రమాదాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ వరస ప్రమాదాల వెనక ఏదైనా కుట్ర కోణం వుందా అన్న కోణంలో పోలీసు అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే రెండు గండాల నుంచి తమ నాయకుడు క్షేమంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

This post was last modified on November 6, 2026 10:13 am

Share

Recent Posts

ఒకే వేదికపై జగన్, విజయ్, త్రిష, కేటీఆర్

కొన్ని నెలల ముందు చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు…

48 minutes ago

బంధాలు వద్దు.. బాధ్యతలు వద్దు.. జెన్ జీ కొత్త జీవన మంత్రం..

ఒకప్పుడు చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలతో స్థిరపడటం.. ఇవే జీవితంలో…

9 hours ago

ఆర్-ఆర్ ట్యాక్స్ ఇంత‌లా వ‌సూలు చేస్తున్నారా?!

తెలంగాణ‌లో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తిప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

11 hours ago

‘ఒరే.. మేం బానే ఉంటాం.. మీరెందుకురా గొడ‌వ ప‌డేది’

అనంత‌పురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, టీడీపీ…

11 hours ago

భోగి మంటలకు మంచి అవకాశం

నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ…

11 hours ago

గ్యాస్ సిలిండర్‌కు మంటలు వస్తే ఇలాగా చేసేది?

గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే కేవలం వినియోగదారుడి ఇంటికి దానిని చేర్చడం మాత్రమే కాదు. సిలిండర్ భద్రత, గ్యాస్ లీకేజీని…

12 hours ago