Political News

ఒకే వేదికపై జగన్, విజయ్, త్రిష, కేటీఆర్

కొన్ని నెలల ముందు చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం.. ఆ పెళ్లికి టీవీకే అధినేత విజయ్ కూడా హాజరు కావడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు రాజకీయంగా పెద్ద చర్చకే దారి తీశాయి. ఆ ఫొటోలు పెట్టి జగన్‌కు ఆయన అభిమానులు ఎలివేషన్లు వేసుకున్నారు.

విజయ్ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాక కూడా ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆ గెలుపు వెనుక జగన్ ఉన్నాడని చెప్పుకున్నారు. కానీ అదే వేడుకలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కూడా జగన్ కలిసిన విషయాన్ని విస్మరించారు. ఆ సంగతి పక్కన పెడితే.. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ జగన్, విజయ్ ఒకే వేదిక మీదికి వచ్చారు. ఈసారి కూడా పెళ్లి వేడుకలోనే కావడం విశేషం.

వైఎస్ కుటంబానికి చెందిన అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లి తాజాగా చెన్నైలో ఘనంగా జరిగింది. ఇందులో రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. జగన్ సతీ సమేతంగా ఈ పెళ్లికి వెళ్లారు. మరోవైపు విజయ్.. తన స్నేహితురాలు త్రిషతో ఈ వేడుకకు రావడం విశేషం. మరోవైపు తెలంగాణ అగ్ర నేతల్లో ఒకరు, మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. వీళ్లందరూ ఒకేసారి స్టేజ్ ఎక్కి ఫొటోలకు పోజులు ఇచ్చారు.

ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ, టీవీకే, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య అధికారిక బంధం లేదు, అందుకు అవకాశం కూడా లేదు కానీ.. ఆ పార్టీల అధినేతలతో పాటు వాటి కార్యకర్తలు కొంచెం సన్నిహితంగానే మెలుగుతుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రేప్పొద్దున కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంటే.. ఈ మూడు పార్టీలు ఒకవైపు నిలిస్తే ఆశ్చర్యమేమీ లేదు.

This post was last modified on November 6, 2026 9:26 am

Share

Recent Posts

రెండు యాక్సిడెంట్ల నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే

ఒకే రోజు... వెంటవెంటనే రెండు యాక్సిడెంట్లు. లక్కీగా ఆ ఎమ్మెల్యే బయటపడ్డారు. తెలంగాణాలో ఈ ఘటన కలకలం సృష్టించింది. అయితే…

51 seconds ago

బంధాలు వద్దు.. బాధ్యతలు వద్దు.. జెన్ జీ కొత్త జీవన మంత్రం..

ఒకప్పుడు చదువు పూర్తవగానే మంచి ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలతో స్థిరపడటం.. ఇవే జీవితంలో…

9 hours ago

ఆర్-ఆర్ ట్యాక్స్ ఇంత‌లా వ‌సూలు చేస్తున్నారా?!

తెలంగాణ‌లో కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తిప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

10 hours ago

‘ఒరే.. మేం బానే ఉంటాం.. మీరెందుకురా గొడ‌వ ప‌డేది’

అనంత‌పురం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ, టీడీపీ…

11 hours ago

భోగి మంటలకు మంచి అవకాశం

నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ…

11 hours ago

గ్యాస్ సిలిండర్‌కు మంటలు వస్తే ఇలాగా చేసేది?

గ్యాస్ సిలిండర్ డెలివరీ అంటే కేవలం వినియోగదారుడి ఇంటికి దానిని చేర్చడం మాత్రమే కాదు. సిలిండర్ భద్రత, గ్యాస్ లీకేజీని…

12 hours ago