బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రెండేళ్ల క్రితం సంచలన ఆరోపణలు చేసిన వైనం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. మరోవైపు, ఇటీవల మంత్రి పదవి పోగొట్టుకున్న సురేఖ పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీలో సురేఖకు తలుపులు మూసుకుపోవడంతో ఆమె బీఆర్ఎస్ వైపే అడుగులు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెండేళ్ల తర్వాత కేటీఆర్ కు సురేఖ క్షమాపణలు చెప్పడం, తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ రోజు కేటీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్భంగా కేటీఆర్ కు కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన విషయం గురించి కేటీఆర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. మొన్న ఒక పేపర్ క్షమాపణలు చెప్పిందని, ఈ రోజు ఈ మేడం క్షమాపణలు చెప్పారని అన్నారు.
వీళ్లే కాదని, వరుసలో చాలామంది ఉన్నారని, ఇంకా చాలామంది భవిష్యత్తులో తనకు క్షమాపణలు చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ తో పాటు పలు విషయాల్లో తనపై కొందరు తీవ్ర ఆరోపణలు చేశారని, వారంతా కూడా పశ్చాత్తాప పడి క్షమాపణలు చెబుతారని అన్నారు.
నిజం ఎప్పటికైనా నిలకడ మీద తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. అయితే, తాను మీడియా సమావేశానికి వచ్చిన తర్వాత ఈ క్షమాపణల గురించి తెలిసిందని, కొండా సురేఖ ఏం ట్వీట్ చేశారో ఇంకా చూడలేదని వ్యాఖ్యానించారు. మరి, ఎక్స్ లో చాలా యాక్టివ్ గా ఉండే కేటీఆర్…కొండా సురేఖ ట్వీట్ పై ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on October 29, 2026 7:11 pm
రణబాలితో డీసెంట్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్థన చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు…
రెండేళ్ల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అప్పటి మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు…
రేపు విడుదల కాబోతున్న కల్ట్ మెల్లగా టైటిల్ కు తగ్గట్టే సౌండ్ పెంచే పనిలో పడింది. ఇంతకు ముందు ట్రైలర్…
తెలుగు సినిమా చరిత్రలో లెజెండరీ స్టేటస్ ఉన్న కమెడియన్లు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ తమిళంలో హాస్య నటుల సంఖ్య…
హీరోలకైనా, హీరోయిన్లకైనా కెరీర్లో కొన్నేళ్లు గడవగానే కొన్ని డీఫాల్ట్ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీ పెళ్ళిఎప్పుడు.. మీకు కాబోయేవారికి ఎలాంటి లక్షణాలు…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన సినిమా ఆదర్శ…