‘దసరా’ మూవీతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ శిష్యుడైన అతను.. డెబ్యూ మూవీతో గురువుకు తగ్గ శిష్యుడే అనిపించుకున్నాడు. రెండో సినిమాకు తన మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి. మళ్లీ నానితో జట్టు కట్టి ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ఈ సినిమా మేకింగ్ టైంలో హైప్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. కానీ రిలీజ్ తర్వాత ఆశలన్నీ కూలిపోయాయి.
ఈ మధ్య కాలంలో ఏ చిత్రానికీ రానంత నెగెటివిటీ ఈ సినిమాకు వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ టైంలో, ఇప్పుడు డిజిటల్ రిలీజ్ సందర్భంగా ట్రోల్ జాతర నడిచింది సోషల్ మీడియాలో. ఈ ఏడాది ‘ది రాజాసాబ్’ సినిమాకు బాగా ట్రోలింగ్ నడవగా.. ‘ది ప్యారడైజ్’ దాన్ని మించి వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ సినిమాతో బాగా అన్‌పాపులర్ అయ్యాడు శ్రీకాంత్ ఓదెల. ఇలాంటి టైంలో తన కొత్త సినిమా గురించి వార్త బయటికి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన టైంలో నడిచే ఒక ప్రేమకథ ఆధారంగా శ్రీకాంత్ తన కొత్త చిత్రాన్ని రూపొందించనున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఈ టైంలో శ్రీకాంత్ నుంచి ఇలాంటి సినిమా కరెక్టేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. శ్రీకాంత్ తొలి రెండు చిత్రాలు తెలంగాణ నేపథ్యంలో నడిచేవే. ‘దసరా’ హిట్టయినా సరే.. అది ఏపీలో అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. ఇక ‘ది ప్యారడైజ్’ అయితే ఏపీలో డిజాస్టర్ అయి, తెలంగాణ వరకు బాగా ఆడింది. దీన్ని తెలంగాణ సినిమాగా ఒక వర్గం ప్రొజెక్ట్ చేసింది.
తెలంగాణ వాళ్లు ఈ సినిమాతో పాటు శ్రీకాంత్‌ను కూడా ఓన్ చేసుకున్నారు. ‘ప్యారడైజ్’ను వ్యతిరేకించిన వాళ్లతో యుద్ధం చేశారు.
ఈ క్రమంలో శ్రీకాంత్ మీద తెలంగాణ డైరెక్టర్ అనే ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు విభజన నేపథ్యంలో తెలంగాణ లవ్ స్టోరీ తీశాడంటే అతను ఒక పరిధిలో చిక్కుకుపోయినట్లు అవుతుంది. ఈ సినిమాను కూడా తెలంగాణ వాళ్లు మాత్రమే ఓన్ చేసుకుని, ఆంధ్ర వాళ్లు వ్యతిరేకించే పరిస్థితి రావచ్చు. శ్రీకాంత్ లాంటి దర్శకుడు ఇలా ఒక ప్రాంతానికి పరిమితం అయిపోవడం కరెక్టా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెలంగాణ నేపథ్యంలో సినిమా తీయడం తప్పని కాదు కానీ.. ‘ది ప్యారడైజ్’ సినిమా విషయంలో జరిగింది చూశాక మాత్రం ఈ టైంలో అతనీ సినిమా తీసి తన పరిధిని తనే తగ్గించుకుంటున్నాడా అన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ప్రాంతం, భాష, యాసతో సంబంధం లేకుండా అతను ఒక సార్వజనీనమైన సినిమా తీసి తన సత్తా చాటే ప్రయత్నం చేయాల్సింది. ఆ తర్వాత కావాలంటే తెలంగాణకు సంబంధించి ఒక రూటెడ్ స్టోరీ చెప్పాల్సింది. ఇప్పుడు మాాత్రం ఇలాంటి సినిమాకు టైమింగ్ కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 29, 2026 9:32 pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రెండేళ్ల క్రితం సంచలన ఆరోపణలు…
రణబాలితో డీసెంట్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్థన చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలు పెట్టినప్పుడు…
రెండేళ్ల క్రితం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అప్పటి మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు…
రేపు విడుదల కాబోతున్న కల్ట్ మెల్లగా టైటిల్ కు తగ్గట్టే సౌండ్ పెంచే పనిలో పడింది. ఇంతకు ముందు ట్రైలర్…
తెలుగు సినిమా చరిత్రలో లెజెండరీ స్టేటస్ ఉన్న కమెడియన్లు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ తమిళంలో హాస్య నటుల సంఖ్య…
హీరోలకైనా, హీరోయిన్లకైనా కెరీర్లో కొన్నేళ్లు గడవగానే కొన్ని డీఫాల్ట్ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. మీ పెళ్ళిఎప్పుడు.. మీకు కాబోయేవారికి ఎలాంటి లక్షణాలు…