ప‌వ‌న్ చెప్పింది అర్ధ‌మైందా జ‌గ‌న్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఉద్దేశించి జ‌న‌సేన పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. మంగళ‌వారం.. కూట‌మి పార్టీల అగ్ర‌నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు. అయితే.. వాటిలో కీల‌క‌మైన అంశం.. జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లే. మీరు 2.O చూపిస్తే.. మేం 10X చూపిస్తాం’.. అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. దీనికి కొన్ని నిమిషాల ముందు.. పులివెందుల‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ.. `జ‌గ‌న్ 2.0 వ‌స్తుంది.. అప్పుడు మేమేంటో చూపిస్తాం అని వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలోనే పవన్ మాట్లాడుతూ.. ‘మీరు 2.O చూపిస్తే మేం 10 X చూపిస్తాం. మీరు ఇలా మాట్లాడితేనే 2019లో ప్రజలు గుణపాఠం చెప్పారు’ అని అన్నారు. ఇక‌, దీనికి కొన‌సాగింపుగా జగన్ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరని పేర్కొన్నారు. బలహీనులే ఇలా మాట్లాడుతారని ఎద్దేవా చేయ‌డం గ‌మ‌నార్హం.`జగన్ జనజీవన స్రవంతికి రావాలి అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ప‌న‌వ్ చెప్పింది అర్ధ‌మైందా జ‌గ‌న్ గారూ“ అని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటి?

కూట‌మిగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు విడిపోతాయని, వ‌చ్చే 2029 ఎన్నిక‌ల నాటికి త‌మ‌కు మార్గం సుగ‌మం అవుతుంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ అంచ‌నా. అందుకే.. ఆయ‌న త‌ర‌చుగా జ‌గ‌న్ – 2.0పై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న‌దంతా తిరిగి చెల్లిస్తామ‌ని అంటున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్ చెబుతున్న‌ది సాకారం కావాలంటే.. వైసీపీ అధికారంలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంది. దీనికి కౌంట‌ర్‌గానే ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అస‌లు జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తేనే క‌దా! అనే అర్థంలోనే ప‌వ‌న్ వ్యాఖ్యానించార న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అందుకే కూట‌మి 10 x అని ఆయ‌న తేల్చి చెప్పార‌ని అంటున్నారు.

దీనర్థం.. వైసీపీ ఇక వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. మ‌రో 10 ఏళ్ల‌పాటు తామే అధికారంలో కొన‌సాగుతామ‌ని ప‌వ‌న్ చెప్ప‌క‌నే చెప్పార‌ని అంటున్నారు. ఈ విష‌యం జ‌గ‌న్‌కు అర్థ‌మైతే.. ఆయ‌న అప్ర‌మ‌త్తం అవుతార‌ని లేక‌పోతే మ‌రోసారి ప్ర‌తిప‌క్షంలో కూర్చోక త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ఈ అంశంపై జ‌గ‌న్ ఎలాంటి ఆలోచ‌న చేస్తారో చూడాల‌న్న‌ది మేధావుల మాట. ఇక‌, వైసీపీ నేత‌లు జ‌న జీవ‌న స్రవంతిలోకి రావాలంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డంపైనా నెటిజన్లు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. వైసీపీ నాయ‌కులు హింస, దౌర్జ‌న్యం వంటి మా్గాల‌ను వీడాల‌న్న సందేశం ఇచ్చార‌ని చెబుతున్నారు. ఏదేమైనా.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల అంత‌రార్థం జ‌గ‌న్‌కు అర్థ‌మైతే ఆయ‌న‌లో మార్పు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.