గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా వైసీపీ నాయకుల తీరు మారినట్టుగా లేదు. అధికారం కోల్పోయినప్పటికి రౌడీయిజం మానుకున్నట్టులేదు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యవహార శైలే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చంటున్నారు సీమవాసులు. ఇంతకూ ఏమి జరిగిందంటే….
కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా సోమవారం కర్నూలు నగరంలోని 16వ వార్డు వడ్డే గేరి, కేవీఆర్ గార్డెన్స్ వద్ద మాజీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో టీడీపీ శ్రేణులు కూడా ఎన్నికల ప్రచారానికి అటుగా వచ్చారు. ఇరు పార్టీల నాయకులు ఎదురు పడ్డారు. హాఫీజ్ ఖాన్ హామీలపై స్థానికులు కొందరు నిలదీశారు. మీరు ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కదా అప్పుడు ఏమి చేయకుండా ఇప్పుడు వచ్చి ఏదో చేస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
దీంతో ఏమి జవాబు చెప్పాలో తెలియని మాజీ ఎమ్మెల్యే జనం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కారెక్కి నిలబడి మీసం తిప్పుతూ టీడీపీ నేతలకు సవాల్ విసిరాడు. మరో రెండేళ్లు ఆగితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన అప్పుడు మీ సంగతి తెలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం చేయడానికి ప్రయత్నం చేయడంతో టీడీపీ శ్రేణులు తిరగబడ్డారు. ఓడిపోయిన మీకే అంతుంటే మాకెంత ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల శ్రేణులు సై అంటే సై అని రంగంలోకి దిగారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ను అక్కడ నుంచి పంపించి వేశారు. అయితే ఆయన అంతటితో ఊరుకోలేదు. ఫిర్యాదు చేయడానికని పోలీసు స్టేషన్కు వెళ్లారు. అక్కడ కూడా ఆయన అనుచరులు హల్ చల్ చేశారు. హాఫిజ్ ఖాన్ ను చూసిన స్థానికులు ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు అసహనంతో రెచ్చిపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on October 26, 2026 11:01 pm
వచ్చే నెల నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద బజ్ భీభత్సంగా లేదు కానీ మెల్లగా…
ప్రస్తుతం దాదా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.…
దేశంలో చాలామంది న్యాయమూర్తులు వున్నారు. వారిలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన వాళ్ళ పేర్లే ప్రజలకు తెలుసు. కానీ రవికుమార్ దివాకర్…
ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్లో ఏవో కారణాలతో చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి. అవి బాగా ఆడితే ఛాన్స్ మిస్సయిందే అని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి, ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ఒక రేంజ్…
ఈ దసరాకి జైలర్-2, రణబాలి లాంటి భారీ చిత్రాలతో పాటుగా రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్…