Movie News

సాయిపల్లవి సత్తాకు సరైన పాత్రే దొరికింది

అతి తక్కువ గ్యాప్ లో అంటే కేవలం పదిహేను రోజుల నిడివిలో సాయిపల్లవి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. సంబంధమే లేని వేర్వేరు జానర్లు కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రామాయణలో సీతగా తను ఎలా ఉంటుందోననే ఆసక్తి కుటుంబ ప్రేక్షకుల్లో అధికంగా ఉంది. నవంబర్ 20 రిలీజ్ కానున్న ఓమ్ మరో మైల్ స్టోన్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఇవాళ ఓమ్ నుంచి ఆమె పాత్రను పరిచయం చేసే టీజర్ వదిలారు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారి నిత్య రెడ్డిగా సాయిపల్లవికి పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు రాజ్ కుమార్ పెరియస్వామి. అమరన్ లో ఇదే తరహాలో పెర్ఫార్మన్స్ కు గొప్ప స్కోప్ ఇచ్చే రోల్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకునేలా చేసిన ఈ కల్ట్ డైరెక్టర్ ఇప్పుడు దాన్ని మించిన పాత్రలో చూపించబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాని పట్టుకునే స్పెషల్ మిషన్ మీద పని చేసే ఆఫీసర్ గా విభిన్న షేడ్స్ లో సాయిపల్లవి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

ఓమ్ లో చాలా ప్రత్యేకతలున్నాయి. ధనుష్ హీరో అయినప్పటికీ అంతే ప్రాధాన్యం ఉన్న పాత్రలో మమ్ముట్టి ఒక స్పెషల్ రోల్ చేశారు. శ్రీలీల హీరోయిన్. సాయి అభ్యంక్కర్ సంగీతం మీద ఆల్రెడీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. బయటికొచ్చిన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్ ని బాగా రీచ్ అయ్యాయి. ఓమ్ రెండు భాగాలుగా రానుంది. పైకి పుష్ప తరహా బ్యాక్ డ్రాప్ అనిపించినప్పటికీ ట్రీట్ మెంట్ పరంగా ఎక్కడా పోలిక రానంత షాకింగ్ సబ్జెక్టు రాజ్ కుమార్ రాసుకున్నారని టాక్.

ఇక సాయిపల్లవి విషయానికి వస్తే నిత్య రెడ్డిగా లుక్స్, నటన చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి. రెగ్యులర్ ఫార్మాట్ కి దూరంగా ఆటపాటలు లేకుండా చాలా సీరియస్ గా కనిపించిన విధానం చూస్తుంటే సవాల్ ని స్వీకరించేందుకే ఎస్ చెప్పినట్టు అనిపిస్తుంది. దీని కన్నా ముందు ఆడియన్స్ చూడబోయే రామాయణలో సీతగా తాను ఎంత బెస్ట్ ఛాయసో ఋజువు చేసుకోవాల్సిన బాధ్యత కూడా సాయిపల్లవి మీద ఉంది. ఈ రెండు పరీక్షలు కనక పాసైతే తన ఫిల్మోగ్రఫీలో రెండు క్లాసిక్స్ తోడవుతాయి.

This post was last modified on October 26, 2026 11:04 pm

Share

Recent Posts

వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. మీ అంతు చూస్తా…

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా వైసీపీ నాయకుల తీరు మారినట్టుగా లేదు. అధికారం కోల్పోయినప్పటికి రౌడీయిజం మానుకున్నట్టులేదు.…

35 minutes ago

రెహమానే అసలు మైనస్ అవుతారా

వచ్చే నెల నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద బజ్ భీభత్సంగా లేదు కానీ మెల్లగా…

42 minutes ago

బాలయ్య సినిమాకు సరికొత్త సంగీతం

ప్రస్తుతం దాదా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.…

54 minutes ago

11 నెలల్లో 23 మరణ శిక్షలు – న్యాయమూర్తి బదిలీ

దేశంలో చాలామంది న్యాయమూర్తులు వున్నారు. వారిలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన వాళ్ళ పేర్లే ప్రజలకు తెలుసు. కానీ రవికుమార్ దివాకర్…

4 hours ago

గీత గోవిదం వదిలేశా… రంగస్థలంలో తీసేశారు

ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్లో ఏవో కారణాలతో చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి. అవి బాగా ఆడితే ఛాన్స్ మిస్సయిందే అని…

6 hours ago

చెన్నై ఆటోల్లో తిరుగుతున్న ఓజీ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి, ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ఒక రేంజ్…

7 hours ago