Political News

సీఎంపై స్టింగ్ ఆపరేషన్ ఆరోపణలు

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పై కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయడానికి, రాజకీయంగా అంతం చేయడానికి డీకే భారీ కుట్రకు తెరలేపారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకోసం 600 కోట్లు సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లింగ్ కు ప్లాన్ చేశారని కుమారస్వామి చేసిన ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ డీకే ఎన్నో కుట్రలు చేశారని, వాటిలో ఇది ఒకటని కుమార స్వామి ఆరోపించారు.

కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా జరిగిన స్టింగ్ ఆపరేషన్ పై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కుమార స్వామి చేసిన ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై కూడా ఆయన స్పందించారు. జర్నలిస్ట్ రాకేష్ శెట్టి, కాంగ్రెస్ నాయకురాలు కృపా అల్వా, వారి అనుచరులు కలిసి సిద్ద రామయ్యకు వ్యతిరేకంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారని కుమార స్వామి ఆరోపించారు.

ఆ స్టింగ్ ఆపరేషన్ లో లభించిన కొన్ని రికార్డింగులను అడ్డుపెట్టుకొని సిద్ధరామయ్యను బ్లాక్ మెయిల్ చేసి పదవి నుంచి తొలగించి డీకేను ఆ స్థానంలో కూర్చోబెట్టారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు, సీఎం డీకే ఖండించారు.

కాగా, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందకు డీకే సర్కార్ ఈ స్టింగ్ ఆపరేషన్ డ్రామాను తెరపైకి తెచ్చిందని కుమారస్వామి విమర్శించారు. స్టింగ్ ఆపరేషన్ విచారణలో 80 శాతం పూర్తయిందని, కానీ, కేపీఎస్సీ కుంభకోణం విచారణ 90 శాతం కప్పిపుచ్చారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ కేసు విచారణను జేడీఎస్ వైపునకు మళ్లిస్తోందని మండిపడ్డారు. ఈ ‘స్టింగ్ ఆపరేషన్’ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ మధ్య తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.

This post was last modified on October 26, 2026 2:30 pm

Share

Recent Posts

ఆ పాటకు న్యాయం చేయలేకపోయా – త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిల్మోగ్రఫీలో ‘అరవింద సమేత’ చాలా స్పెషల్. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ త్రివిక్రమ్.. ఈ సినిమాలో పూర్తిగా రూటు మార్చేశాడు.…

29 minutes ago

వివాదాల సుడిగుండం స్వాగతం చెబుతోంది

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫౌజీ టీజర్ పెద్ద దుమారమే రేపేలా ఉంది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని…

50 minutes ago

ఎట్టకేలకు స్పందించిన ఏబీఎన్ RK అల్లుడు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూతురు అంజిలి పెళ్లి గురించి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎలహంకలోని తన ఇంట్లో…

1 hour ago

అప్డేట్ ఇచ్చి దొరికిపోయిన హీరో

‘కార్తికేయ-2’ మూవీతో అనుకోకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఫేమ్‌ను సరిగా…

2 hours ago

భజ గోవిందం… జనాలకు రీచ్ అయిపోయింది

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో సాహిత్యం వినిపించి, సంగీతం శ్రావ్యంగా అనిపించిన పాటలు ఎన్ని ఉన్నాయంటే వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు.…

2 hours ago

‘కేజీఎఫ్’నే కొట్టేసిన చిన్న సినిమా

ప్రేమద ఊరలి.. గత నెల రోజులుగా కన్నడ నాట ఈ చిన్న సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.…

3 hours ago