ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే ముందు రైట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేర్పులేమైనా అవసరం అనుకుంటే అవి చేసుకుని.. ఆ తర్వాత షూటింగ్‌కు రంగంలోకి దిగాలి. కానీ టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ మాత్రం.. అసలు రీమేక్ రైట్సే కొనకుండా షూటింగ్ మొదలుపెట్టాడట. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’ విషయంలో ఇలా జరిగిందట. ఒక పాడ్‌కాస్ట్‌లో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు విశ్వక్.
‘వెళ్ళిపోమాకే’ చిత్రంతో నటుడిగా పరిచయం అయిన విశ్వక్.. దాంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అందులో అమాయకుడైన పాత్రలో నటించిన అతను.. ‘ఫలక్‌నుమా దాస్’లో మాత్రం అగ్రెసివ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం మలయాళ హిట్ ‘అంగామలై డైరీస్’కు రీమేక్ అయినప్పటికీ.. తెలుగులో దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొంచెం మాస్‌గా రీమేక్ చేసి మెప్పించాడు విశ్వక్.
ఐతే ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకోకుండానే షూటింగ్ మొదలుపెట్టిన విషయాన్ని అతను తాజాగా వెల్లడించాడు. హైదరాబాద్‌లో రెండు పండుగలకు సంబంధించిన దృశ్యాలను తాను షూట్ చేశానని.. అది ఎందుకు అని తన ఫ్రెండ్ అడిగితే ‘అంగామలై డైరీస్’ను రీమేక్ చేస్తున్నానని చెప్పానని.. మరి రైట్స్ ఎప్పుడు తీసుకున్నావు అని అడిగితే, ఆ పని మీదే రెండు రోజుల్లో కేరళ వెళ్తున్నట్లు చెబితే అతను షాకయ్యాడని విశ్వక్ తెలిపాడు.
‘అంగామలై డైరీస్’ రీమేక్ చేయాలని ఫిక్సయ్యాకే షూటింగ్ మొదలుపెట్టానని.. ఐతే ఆ సినిమా ఒరిజినల్‌లో కొన్ని సీన్లను తన తండ్రికి, మామకు చూపిస్తే ఇదేం సినిమా అన్నట్లు చూశారని.. కానీ సినిమాను మ్యూట్‌లో పెట్టి తెలుగు డైలాగులతో కథ నరేట్ చేస్తుంటే ఎగ్జైట్ అయ్యారని.. ఆ తర్వాత కేరళకు వెళ్లి రైట్స్ తీసుకున్నానని.. అందుకోసం రూ.11 లక్షలు ఖర్చయిందని విశ్వక్ తెలిపాడు. ఐతే ఈ చిత్రాన్ని తెలుగు తప్ప ఇంకే భాషలోనూ డబ్ చేయకూడదన్న షరతు మీద రైట్స్ ఇచ్చారని, 11 లక్షలు ఆ రోజుకు పెద్ద మొత్తం అని విశ్వక్ తెలిపాడు.
This post was last modified on October 26, 2026 3:14 pm
టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్యా లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆ లోటు కనిపించేది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారీ షాట్లు…
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పై కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ…
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిల్మోగ్రఫీలో ‘అరవింద సమేత’ చాలా స్పెషల్. ఎంటర్టైనర్లకు పేరుపడ్డ త్రివిక్రమ్.. ఈ సినిమాలో పూర్తిగా రూటు మార్చేశాడు.…
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫౌజీ టీజర్ పెద్ద దుమారమే రేపేలా ఉంది. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని…
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూతురు అంజిలి పెళ్లి గురించి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎలహంకలోని తన ఇంట్లో…
‘కార్తికేయ-2’ మూవీతో అనుకోకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఫేమ్‌ను సరిగా…