స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు వేయకుండా టీడీపీ అడ్డుకుంటుందని వైసీపీ అధినేత జగన్ నానా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయన ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేయడం, కోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడం తీసిందే. అయినా సంతృప్తి చెందని జగన్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ వేయనీయడం లేదని కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇంతకూ జగన్ చెబుతుంది నిజమేనా..? స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో నామినేషన్లకు చాలా తేడా కనిపిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు, 659 జెడ్పీటీసీ స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. టీడీపీ తరఫున 22,013 , వైఎస్సీర్సీపీ తరుపున 20,556, జనసేన తరుపున 4,609, బీజేపీ నుంచి 1,150 నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ తరఫున 2,078, వైఎస్సీర్సీపీ నుంచి 1,815, జనసేన నుంచి 679, బీజేపీ నుంచి 255 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వాస్తవం ఇలా వుంటే వైసీపీ అధినేత జగన్ మాత్రం నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని గగ్గోలుపెడుతున్నారని టీడీపీ, కూటమి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ ఎందుకిలా అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతుంటే ఆయన ఎక్కడో బెంగళూరులో కూర్చున్నాడు. పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడం, వారికి దిశా నిర్ధేశం చేయడం మానేసి ఎన్నికల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, నామినేషన్లు వేయకుండా టీడీపీ అడ్డుకుంటుందని ప్రచారం చేయడంలో తలమునకలయ్యారు. రెండ్రోజులకోసారి రాష్ట్రానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తిరిగి బెంగళూరు విమానం ఎక్కేస్తున్నారు. ఆయన వైఖరేంటో అర్ధం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుత సమీకరణాల గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగుతాయని తేలిపోయింది. ఎలాగు గెలిచే అవకాశం లేదు కనుక ఎన్నికల్లో గందరగోళం సృష్టించాలి. టీడీపీ మీద బురద చల్లాలి. రేపటి ఓటమిని టీడీపీ మీద నెట్టాలి. ఇది జగన్ వ్యూహంగా కూటమి నేతలు చెబుతున్నారు. లేకపోతే ఒకవైపు నామినేషన్లు వేస్తూ మరోవైపు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడం ఎందుకు..? ఇదే ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు….
This post was last modified on October 26, 2026 8:27 am
రాన్రాను రాజకీయాల్లో విద్వేష కల్చర్ పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు విభేదాలు ఉండేవి. విధానాల పరంగా…
ప్యాన్ ఇండియా సినిమాలకు బజ్ కొనసాగాలంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇస్తూ ఒక టెంపో మెయింటైన్ చేయడం చాలా అవసరం.…
హిట్టు ఫ్లాపు పక్కన పెడితే వందల కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన ఏ దర్శకుకిడైనా తర్వాత…
జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తమిళనాడులో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తుండగా ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్…
రణబాలి క్రమంగా నెమ్మదిస్తోంది. ఇప్పటిదాకా దసరా సెలవులు, రెండు వీకెండ్స్ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ ఆయిన విజయ్ దేవరకొండకు వరస…
హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ ఎంచుకున్న సినిమాల్లో మిరాయ్ కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో…