హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ ఎంచుకున్న సినిమాల్లో మిరాయ్ కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో తన సెలక్షన్ చాలా జాగ్రత్తగా ఉండటం మొదలయ్యింది. రొటీన్ కథలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు కాకుండా ఫాంటసీ ఎలిమెంట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ కోసం ట్రైటర్స్ షో చేయడం ద్వారా కొత్త రకం ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న వైనం ఎలాంటి ఫలితం ఇస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికైతే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది.
ఇదిలా ఉండగా తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న వాటిలో మొదటిగా రెడీ అవుతున్నది మిరాయ్ 2. పెద్దగా హడావిడి లేకుండా, బయటికి లీక్స్ ఇవ్వకుండా సైలెంట్ గా పని కానిస్తున్నారు. మొదటి భాగంలో ఉన్న క్యాస్టింగ్ తో పాటు ఈసారి కొన్ని అదనపు ఆకర్షణలు జోడిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కోసం శ్రీలీల మీద ఫోటో షూట్ జరిగిందని వినికిడి. చాలా ప్రాధాన్యం ఉండటంతో తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూనిట్ టాక్.
అంతే కాదు ప్రభుదేవా సైతం ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని తెలిసింది. స్కేల్ పరంగా మిరాయ్ 2 బడ్జెట్ చాలా పెంచేశారు. అంచనాలు ఎక్కువగా ఉండటంతో ప్యాన్ ఇండియా లెవెల్ లో వర్కౌట్ అయ్యేలా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 2027 ద్వితీయార్థంలో విడుదల చేసేలా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లానింగ్ లో ఉంది. సాంకేతికంగా బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చాకే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.
ఇది కాకుండా తేజ సజ్జ చేస్తున్న జాంబీ రెడ్డి సీక్వెల్ కూడా వేగంగా పరుగులు పెట్టేలా ఉంది. కాన్సెప్ట్ టీజర్ కి రెస్పాన్స్ బాగా వచ్చిన నేపథ్యంలో కంటెంట్ ని మరింత జాగ్రత్తగా షేప్ చేస్తున్నారని అంటున్నారు. ఇవి రెండు కాకుండా తేజ ఇంకెవరికి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. త్వరలో బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలకబోతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ తన వైపు నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేని అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడట.
This post was last modified on October 25, 2026 5:34 pm
https://youtu.be/GBEMMz7D6C8?si=HbG0xf2skHBR-huG 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన…
ఇంకో అయిదు రోజులో ఆదర్శ కుటుంబం ఏకే 47 విడుదల కానుంది. ముందు నుంచి కొంత నెగటివిటీ నడిచినప్పటికీ ట్రైలర్…
ఒకప్పుడు హీరోలకు షూటింగ్ లేని టైంలో వాళ్ళను కలుసుకునేందుకు అభిమానులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళేవాళ్ళు. స్టార్లు కూడా విసుక్కోకుండా…
పదేళ్ల కిందట ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంతటా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు మలయాళ నటుడు నివిన్ పౌలీ. ఆ…
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతా బాగుందన్న ఫీలింగ్ ఆయా పార్టీల్లో పైకే కనిపిస్తోంది. అంతర్గతంగా చూస్తే..…
ఫ్యామిలీ మ్యాన్ పుణ్యమాని ఓటిటి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరిగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ కొత్త…