రాన్రాను రాజకీయాల్లో విద్వేష కల్చర్ పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు విభేదాలు ఉండేవి. విధానాల పరంగా విమర్శలు చేసుకునేవారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళేవారు కాదు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే అంతర్జాతీయ వేదికలపై భారతదేశం అంటే గౌరవం వుండేది.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా రాజకీయాలు దిగజారిపోయాయి. విమర్శల స్థానంలో దూషణలు, బూతులు వచ్చి చేరాయి. ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పీకలదాకా ద్వేషంతో నాయకులు ఉప్పు నిప్పులా వ్యవహారిస్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉల్లాసభరిత వాతావరణం కనిపించింది.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరుపున వంగవీటి రాధా కృష్ణ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐపీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు పోటీకి దిగడం తెలిసిందే. ఇక్కడ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షణం తీరికలేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే ఆదివారం గుణదల డివిజన్లో కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. సరిగ్గా ఆ సమయంలో ఏబీ వెంకటేశ్వర రావు అటుగా వచ్చారు. రాధాకృష్ణ కనిపించగానే హాయ్ అంటూ పలకరించారు. ప్రతిగా రాధా నమస్కారం చేశారు. ఇద్దరు దగ్గరగా చేరుకొని ఆలింగనం చేసుకున్నారు.
ఈ దృశ్యాన్ని అక్కడ వున్న టీడీపీ, జనసేన, కాంగ్రెస్ కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఇరు పార్టీల మధ్య పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యం చూసిన నెటిజన్లు కూడా ఇరువురు అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. నగర ప్రజలు ఉత్సాహంగా చర్చించుకోవడం కనిపించింది. రాజకీయాలలో ఇలాంటి సానుకూల ధోరణి పెరగాల్సిన అవసరం వుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నాయకులు కలిసి మెలిసి పనిచేస్తే ఏ నగరమైన అభివృద్ధి చెందుతుందని ప్రజాస్వామిక వాదులు చెప్పుకుంటున్నారు.
This post was last modified on October 26, 2026 8:21 am
ప్యాన్ ఇండియా సినిమాలకు బజ్ కొనసాగాలంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇస్తూ ఒక టెంపో మెయింటైన్ చేయడం చాలా అవసరం.…
హిట్టు ఫ్లాపు పక్కన పెడితే వందల కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన ఏ దర్శకుకిడైనా తర్వాత…
జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తమిళనాడులో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తుండగా ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్…
రణబాలి క్రమంగా నెమ్మదిస్తోంది. ఇప్పటిదాకా దసరా సెలవులు, రెండు వీకెండ్స్ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ ఆయిన విజయ్ దేవరకొండకు వరస…
హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ ఎంచుకున్న సినిమాల్లో మిరాయ్ కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో…
https://youtu.be/GBEMMz7D6C8?si=HbG0xf2skHBR-huG 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన…